
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో సీవీ-సిరీస్ భారత్ లో లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా, తొలుత Xiaomi 14 Civi మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ కోసం షావోమి ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ జూన్ 13వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, లైకా లెన్సెస్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ తో Xiaomi 14 Civi వస్తోంది. ఓసారి ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం.
Xiaomi 14 Civi నుంచి ఏం ఆశించవచ్చు?
కెమెరా: Xiaomi 14 Civi లో అద్భుతమైన కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా విభాగం కోసం షావోమి సంస్థ లైకా తో కలిసి పని చేసింది. లైకాచే ట్యూన్ చేయబడిన 50ఎంపి సమ్మిలక్స్ లెన్స్ ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ సెన్సర్ 25ఎంఎం సినిమాటిక్ హెచ్డీఆర్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇంకా 50ఎంపి 50ఎంఎం పొట్రెయిట్ టెలీఫోటో 2ఎక్స్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
ఈ ఫోన్ 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తో వస్తుండటం విశేషం. ఈ సెన్సర్స్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటాయి. 4కే క్వాలిటీతో టెలీప్రాంప్టర్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ఫోకస్ స్విచింగ్, డ్యూయల్ వీడియో మోడ్, జూమ్ స్మూథ్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.
డిస్ప్లే: Xiaomi 14 Civi లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 68 బిలియన్+ కలర్స్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటాయి.
ప్రాసెసర్: Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
చార్జింగ్: Xiaomi 14 Civi డివైజ్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఐపీ రేటింగ్: Xiaomi 14 Civi డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీంతో ఈ ఫోన్ నీరు, దుమ్ముకి ఎదురు నిలిచి ఉండగలదు.











