Home News లేటెస్ట్ అప్డేట్ తో కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన WhatsApp

లేటెస్ట్ అప్డేట్ తో కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన WhatsApp

హైలైట్స్

మెసేజింగ్ యాప్ WhatsApp ఎన్నో కొత్త ఫీచర్లను గత కొన్ని రోజులుగా టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు బీటా వర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్లను పబ్లిక్ గా రోలౌట్ చేయనున్నారు. Meta కంపెనీ యొక్క ఇన్‌స్టంట్ యాప్ అయిన వాట్సాప్ కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. వీటిలో కొన్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బీటా అప్డేట్స్ పై కనిపిస్తున్నాయి. యూజర్లు తమకు తామే మెసేజ్ చేసుకునే ఫీచర్ ని వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. వాట్సాప్ ని నోట్ మేకింగ్ యాప్ లాగా వాడే యూజర్లకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.

అలాగే వాట్సాప్ గ్రూప్ చాట్స్ కోసం ఓ కొత్త ఫీచర్ ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యాప్స్ పై టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. గ్రూప్ చాట్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ కి స్వల్ప మార్పులు చేయనున్నారట. ఈ ఫీచర్ వల్లన యూజర్ ప్రొఫైల్ ఫోటోలు గ్రూప్ చాట్స్ లో కనిపిస్తాయి. మరి వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యాప్స్ కోసం ఏయే ఫీచర్లను తీసుకురానుందో తెలుసుకుందాం పదండి.

WhatsApp Beta Update తో యాడ్ అయిన రెండు కొత్త ఫీచర్లు

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బీటా అప్డేట్స్ లో భాగంగా వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ బీటా యాప్ వర్షన్ 2.22.24.2 పై అందుబాటులో ఉంటాయి. ఐఓఎస్ విషయానికి వస్తే ఈ ఫీచర్లు iOS 22.23.0.70 పై అందుబాటులో ఉంటాయి.

ఫస్ట్ ఫీచర్ మెసేజ్ యువర్‌సెల్ఫ్ ని తొలుత వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్ సైట్ అయిన WABetaInfo గమనించింది. చాట్ విండోని క్రియేట్ చేసుకుని దానికి టెక్ట్స్ లేదా ఫార్వార్డ్ మెసేజెస్ ని పంపుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మేసేజ్ యువర్‌సెల్ఫ్ అనే చాట్ ని హైలైట్ చేస్తూ మెసేజ్ యువర్‌సెల్ఫ్ అనే క్యాప్షన్ ని వాట్సాప్ యాడ్ చేసినట్లు బీటా యూజర్లు గమనించారు.

గ్రూప్ చాట్ లో పాలుపంచుకునే సభ్యుల యొక్క ప్రొఫైల్ ఫోటోలు చాట్ లో కనిపించే మరొక ఫీచర్ పై కూడా వాట్సాప్ పని చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు కూడా బీటా ప్లాట్ఫామ్ పై ఉన్న పలువురు యూజర్ల ద్వారా టెస్ట్ చేయబడుతున్నాయి. మీరు కూడా ఆ కొందరు లక్కీ బీటా యూజర్లలో ఉంటే ఈ ఫీచర్లను అందరి కంటే ముందే ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం దొరుకుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.