Home News నివేదిక: చౌకగా Mobile Data అందించే దేశాల్లో భారత్ కి ఐదోస్థానం

నివేదిక: చౌకగా Mobile Data అందించే దేశాల్లో భారత్ కి ఐదోస్థానం

హైలైట్స్:

ఓవైపు 5జీ మెగా స్పెక్ట్రమ్ వేలం కొనసాగుతోన్న తరుణంలో, వరల్డ్ వైడ్ మొబైల్ డేటా ప్రైసింగ్ 2022 జాబితాలో భారత్ 5 వ స్థానంలో నిలిచింది. 233 దేశాల్లో 1జిబి డేటాకు అయ్యే ఖర్చుని బట్టి, ఈ నివేదికను రూపొందించారు. ఈ లిస్టుని Cable.co.uk అనే కంపారిజన్ వెబ్ సైట్ తయారు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తక్కువ ధరలో డేటాను అందిస్తోన్న దేశాల్లో ఇజ్రాయిల్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 0.04 డాలర్ల (రూ.3) ఒక జిబి డేటాను అందిస్తున్నారు. సౌత్ అట్లాంటిక్ ఓషియన్ లో సెయింట్ హెలెనా అనే బ్రిటీష్ ఓవర్సీస్ టెర్రిటరీ అత్యధికంగా 41.06 డాలర్లు (రూ.3,500) వసూలు చేస్తూ ఈ జాబితాలో ఖరీదైన డేటా సెల్లర్ గా నిలిచింది.

ప్రపంచంలో నార్తర్న్ అమెరికా 4.98 డాలర్ల (రూ.400) తో ఖరీదైన రీజియన్ గా నిలిచింది. ఇజ్రాయిల్, ఇటలీ, శాన్ మరినో, ఫిజీ, భారత్ మొబైల్ డేటా తక్కువ ధరకే అందించే టాప్-5 దేశాలుగా నిలిచాయి.

ప్రపంచ వ్యాప్తంగా Mobile Data ధరలు

Cable.co.uk రూపొందించిన వరల్డ్ వైడ్ మొబైల్ డేటా ప్రైసింగ్ 2022 జాబితాలో, తక్కువ ధరకే మొబైల్ డేటాను అందిస్తోన్న ఐదు దేశాల్లో భారత్ చోటు సంపాదించింది. 0.17 డాలర్ల (రూ.14) తో భారత్ కు 5 వ స్థానం దక్కింది. భారత దేశంలో ఉన్న జనాభా ఎక్కువగా మొబైల్ డేటా మీద ఆధారపడతారని, దీంతో అధిక డిమాండ్ ఉండటంతో సర్వీస్ ప్రొవైడర్లు సరసమైన ధరలకే డేటాను అందిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇక 5జీ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇజ్రాయిల్ అగ్రస్థానంలో నిలిచి గ్లోబల్ లీడర్ గా అవతరించింది.

జాబితా ప్రకారం, సెయింట్ హెలెనా, ఫాక్ ఐలాండ్స్, సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ, టొకేలావు, యెమెన్ అనే ఐదు దేశాలు ఎక్కువ ధరకు మొబైల్ డేటాను అందిస్తున్నాయి. వీటిలో నాలుగు ఐలాండ్ దేశాలు కాగా, మరొకటి సబ్-సహారన్ ఆఫ్రికా రీజియన్ కు చెందినది. 4.47 డాలర్ల (రూ.400) తో మొత్తం 13 గ్లోబల్ రీజియన్స్ లో కెల్లా ఈ రీజియన్ రెండవ ఖరీదైనదిగా నిలిచింది. ఉత్తమ ఇన్ఫాస్ట్రక్చర్, హెవీ రిలయన్స్, తక్కువ వినియోగం, సంపన్న ఆర్థిక వ్యవస్థ, వంటి నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులను పరిశోధకులు నిర్ణయించారు.

తక్కువ ధరలో డేటాను అందించే దేశాలు.. ఉత్తమ ఇన్ఫాస్ట్రక్చర్, హెవీ రిలయన్స్, తక్కువ వినియోగం, సంపన్న ఆర్థిక వ్యవస్థ అనే వాటి క్రిందకు వస్తాయి. ఇక ఎక్కువ ధరకు డేటాను అందిస్తోన్న దేశాలు, తక్కువ వినిమయం, అద్వాన్నమైన మౌళిక సదుపాయాలు అనే కేటగిరీలోకి వస్తాయి.

ఇక భారత్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఉన్న డేటా ధరలను చూస్తే, ఫర్వాలేదనిపిస్తోంది. అయితే, 5జీ సేవలు త్వరలో ప్రారంభమవ్వనున్నాయి కాబట్టి ఈ డేటా ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవచ్చని చెప్పవచ్చు. ఇప్పటికే 5జీ ప్లాన్ ధరలు, 4జీ రేట్స్ తో పోలిస్తే అధికంగా ఉంటాయని నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. దీన్ని బట్టి, రానున్న రోజుల్లో భారత్ లో డేటా ఖర్చులు పెరుతాయనడంలో సందేహం అక్కర్లేదు. 5జీ రాక తర్వాత, 4జీ డేటా ధరలను తగ్గిస్తే కనుక, పరిస్థితి మరోలా ఉంటుంది. సామాన్యుడికి ఈ విషయం ఎంతో మేలు చేస్తుంది. మరి ఆ దిశగా టెలీకామ్ కంపెనీలు ఆలోచిస్తాయో లేదో చూడాలి.