Home News గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ ద్వారా షావోమీ 12టీ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై ఈ షావోమీ ఫోన్ కనిపించింది. ఇక లీక్ అయిన లైవ్ ఇమేజ్ ద్వారా షావోమీ 12టీ ప్రో యొక్క డిజైన్, కెమెరా వివరాలు తెలిశాయి. గతంలో బయటకు వచ్చిన మరొక లీక్ ద్వారా షావోమీ 12టీ ప్రో కి సంబంధించిన హార్డ్‌వేర్ డీటెయిల్స్ తెలిశాయి.

ఈ లీకైన మొత్తం వివరాలను బట్టి ఈ నెల మొదట్లో లాంచ్ అయిన రెడ్మీ కే50 అల్ట్రా ఫోన్ కి షావోమీ 12టీ ప్రో రీబ్రాండెడ్ వర్షన్ అని అర్థమవుతోంది. షావోమీ 12టీ ప్రో గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ లో కనిపించడం ద్వారా త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉండనుందని స్పష్టమవుతోంది. మరి షావోమీ 12టీ ప్రో నుంచి మనం ఏం ఆశించవచ్చో ఇక్కడ చూద్దాం. పదండి.

Xiaomi 12T Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

షావోమీ 12టీ ప్రో ని గూగుల్ ప్లే కన్సోల్ పై తొలుత మైస్మార్ట్‌ప్రైస్ గమనించింది. డైటింగ్ అనే కోడ్ నేమ్ ని షావోమీ 12టీ ప్రో కలిగి ఉంది. అంతకు ముందు ఇదే కోడ్ నేమ్ రెడ్మీ కే50 అల్ట్రా కూడా కలిగి ఉండటం మనం చూశాం. షావోమీ 12టీ ప్రో 12జిబి వరకు ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. షావోమీ 12టీ ప్రో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనుంది. ఈ ఫోన్ 1220*2712 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్, 480 స్క్రీన్ డెన్సిటీని కలిగి ఉండనుంది.

Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

షావోమీ 12టీ ప్రో, రెడ్మీ కే50 అల్ట్రా యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్ కావున స్పెసిఫికేషన్స్ కూడా ఆ ఫోన్ మాదిరే ఉంటాయని ఊహించవచ్చు. షావోమీ 12టీ ప్రో లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. షావోమీ 12టీ ప్రో లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 20 ఎంపి కెమెరాను అమర్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.