హైలైట్స్:
- Geekbench పై కనిపించిన Xiaomi 12T Pro, లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Xiaomi 12T Pro
- అతి త్వరలో Xiaomi 12 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా
Xiaomi 12T సిరీస్ కొన్ని వారాల్లో గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Xiaomi 12T, Xiaomi 12T Pro మోడల్స్ ఉంటాయి. ఇటీవలి కాలంలో, ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్స్ సైట్స్ లో కనిపించాయి. దీంతో ఫోన్ల యొక్క హార్డ్ వేర్ కి సంబంధించి పలు వివరాలు తెలిసాయి. ఇప్పుడు Xiaomi 12T Pro బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఈ విషయాన్ని మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. ర్యామ్, ప్రాసెసర్, ఓఎస్ వర్షన్, తదితర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లిస్టింగ్ ద్వారా తెలిసాయి. 22081212UG అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.
సింగిల్ స్కోర్ టెస్ట్ లో Xiaomi 12T Pro 1300 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 4061 పాయింట్లు సాధించింది. 200ఎంపి భారీ సెన్సర్ తో వస్తున్న తొలి షావోమీ ఫోన్ ఇదేనని చెబుతున్నారు.
గీక్‌బెంచ్ పై కనిపించిన Xiaomi 12T Pro
గీక్ బెంచ్ పై 22081212UG అనే మోడల్ నంబర్ తో Xiaomi 12T Pro కనిపించింది. మోడల్ నంబర్ చివర్లో ఉన్న G అనే అక్షరం, ఇది గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో Xiaomi 12T Pro రానుందని సమాచారం. అలాగే ఈ చిప్ గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPU ని వాడుకోనుంది.
Xiaomi 12T Pro ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో Xiaomi 12T Pro లభించనుంది.
Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్
Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండనున్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Xiaomi 12T Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్ తో రానుంది. ఇందులో 200ఎంపి మెయిన్ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇక Xiaomi 12T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
త్వరలోనే ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో షావోమీ నుంచి టీజర్ ఇమేజెస్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఆటోమొబైల్, టెలీకామ్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.