FCC సర్టిఫికేషన్ క్లియర్ చేసిన Xiaomi 12T Pro

హైలైట్స్:

  • షావోమీ 12టీ ప్రో స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్ ని ఆఫర్ చేస్తుందని అంచనా
  • 200ఎంపి కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం
  • ఇప్పటివరకు కంపెనీ నుంచి వెల్లడి కాని అధికార ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను అమ్మే సంస్థ అయిన షావోమీ, ఇటీవలి కాలంలో వరుసగా ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ రెగ్యులేటర్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) డేటాబేస్ లో షావోమీ 12టీ ప్రో కనిపించింది. గ్లోబల్ డేటాబేస్ పై ఈ స్మార్ట్‌ఫోన్ కనిపించడంతో, తొలుత గ్లోబల్ గా ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అలాగే ఇది చైనా-సెంట్రిక్ డివైజ్ కాదని స్పష్టమవుతోంది.

Xiaomi 12T Pro నుంచి ఏమి ఆశించవచ్చు

యూఎస్ ఎఫ్‌సీ‌సీ లిస్టింగ్ ప్రకారం, షావోమీ 12టీ ప్రో డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ 4జీ ఎల్టీఈ, 5జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అలాగే ఇందులో నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) కూడా ఉంటుందని సమాచారం. దీని ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ జరిపేందుకు వీలుంటుంది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ని బట్టి, షావోమీ 12టీ ప్రో మూడు వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. వీటిలో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ఉండనున్నాయి.

ఫోన్స్ కి సంబంధించి నమ్మదగిన ప్రీ-లాంచ్ సమాచారం ఇచ్చే ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, షావోమీ 12టీ ప్రో యొక్క లైవ్ ఇమేజ్ ని షేర్ చేశాడు. ఈ ఇమేజ్ ద్వారా 200ఎంపి బ్రాండింగ్ ని రియర్ కెమెరా మాడ్యూల్ పై ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి ఈ భారీ కెమెరా 200ఎంపి లెన్స్ అని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.

గత నివేదికలను బట్టి, షావోమీ 12టీ ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను కలిగి ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ అందిస్తున్నారు. షావోమీ 12టీ ప్రో లో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కు సంపోర్ట్ చేయనుంది. ఇక ఈ ఫోన్లో ప్రత్యేకాకర్షనగా 200ఎంపి రియర్ కెమెరా నిలవనుంది. మిగతా కెమెరాల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా చూస్తే 200ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ మెయిన్ సెల్లింగ్ పాయింట్స్ కానున్నాయి.

Xiaomi 12T Pro Specifications

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్
  • 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 200ఎంపి మెయిన్ కెమెరా
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

షావోమీ ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 12టీ సిరీస్ ని రివీల్ చేశాక, ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.

Previous articleమాచర్ల నియోజకవర్గం OTT అప్డేట్
Next articleరెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన Airtel
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.