హైలైట్స్:
- సెప్టెంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో
- కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్న హ్యాండ్సెట్స్
- భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న షావోమీ 12టీ సిరీస్
షావోమీ 12 మరియు షావోమీ 12ఎస్ సిరీస్ ని లాంచ్ చేశాక, సదరు కంపెనీ షావోమీ 12టీ లైనప్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి షావోమీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అనౌన్స్మెంట్ కి ముందు రూమర్ల ద్వారా పలు విషయాలు తెలిశాయి. టిప్ స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో ప్రైస్‌బాబా వెబ్ సైట్ 12టీ సిరీస్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. షావోమీ 12టీ సిరీస్ లో రెండు మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి: షావోమీ 12టీ మరియు షావోమీ 12టీ ప్రో.
షావోమీ 12ఎస్ సిరీస్ మాదిరి కాకుండా, షావోమీ 12టీ ఫోన్లు గ్లోబల్ గా, అలాగే భారత్ లో కూడా లాంచ్ అవ్వనున్నాయి. షావోమీ 13 ప్రకటనకు ముందే షావోమీ 12టీ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా. ఇక షావోమీ 13 నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం. సాధారణ షెడ్యూల్ కంటే ఒక నెల ముందే షావోమీ 13 మార్కెట్ లోకి రానుంది.
Xiaomi 12T సిరీస్ లాంచ్ టైమ్ లైన్
ప్రైస్ బాబా కథనం ప్రకారం, షావోమీ 12టీ సిరీస్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే, ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
Xiaomi 12T సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్స్
షావోమీ 12టీ ప్రో రెండు స్టోరేజీ వేరియంట్లో లభ్యం కానుంది. అవి: 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి. షావోమీ 12టీ ప్రో కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
మరోవైపు, షావోమీ 12టీ 8జిబి + 128జిబి మోడల్ తో పాటు, 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లో లభించనుంది. ఈ ఫోన్ కూడా కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Xiaomi 12T సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
షావోమీ 12టీ ప్రో 5జీ, రెడ్మీ కే50 అల్ట్రా గా రీబ్రాండ్ చేయబడిందనే పుకారు వినిపిస్తోంది. అయితే ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరాను వినియోగించారు. మోటో ఎక్స్30 ప్రో లో వాడబడిన శాంసంగ్ హెచ్పీ1 200ఎంపి సెన్సర్ ని ఇందులో వాడినట్లు సమాచారం. ఇక దీంతో పాటు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ ఉండనున్నాయి.
మరోవైపు 12టీ 5జీ లో 108ఎంపి కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని సమాచారం. షావోమీ 12టీ మరియు షావోమీ 12టీ ప్రో లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే షావోమీ 12టీ ప్రో 5జీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని సమాచారం. మరోవైపు 12టీ 5జీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంటుందట.
షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అమర్చనున్నట్లు సమాచారం. మరోవైపు షావోమీ 12టీ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అల్ట్రా చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే, రెండు డివైజెస్ కూడా 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 1220*2712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉండనున్నాయి.
Xiaomi 12T, Xiaomi 12T Pro ధర (అంచనా)
షావోమీ 12టీ 5జీ ధర 600 – 620 యూరోలు (దాదాపు రూ.48,700 నుంచి రూ.50,400) గా ఉంటుందని అంచనా. మరోవైపు, షావోమీ 12టీ ప్రో 5జీ ధర 800 – 820 యూరోలు (దాదాపు రూ.65,000-రూ.66,700) ఉంటుందని తెలుస్తోంది. భారత్ లో ఈ ఫోన్ల ధరలు చౌకగా ఉంటాయని అంచనా వేయవచ్చు.













