హైలైట్స్
- త్వరలో చైనాలో లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Xiaomi 13 స్మార్ట్ ఫోన్
- తాజాగా BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ Xiaomi 13 ని చైనాలో లాంచ్ చేయనుంది. 2022 డిసెంబర్ లో చైనాలో Xiaomi 13 ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అంటే స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 ని షావోమి అతి త్వరలో భారత్ లో లాంచ్ చేయనుందన్న మాట. దీనికి బలం చేకూర్చుతూ, తాజాగా Xiaomi 13 డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.
భారత్ లో Xiaomi 13 లాంచ్
పైన కనిపిస్తోన్న BIS లిస్టింగ్ ఇమేజ్ ద్వారా, Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 2210132G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. రీసెంట్ గా ఈ డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ ని పొందింది. అయినప్పటికీ, సర్టిఫికేషన్ లిస్టింగ్ అనేది లాంచ్ ని ఖరారు చేయదు. అయితే షావోమి తన ఫ్లాగ్షిప్ డివైజ్ ని గత ఫ్లాగ్షిప్ మాదిరే భారత్ కి తీసుకొస్తుందని చెప్పవచ్చు. మోడల్ నంబర్ లో కనిపించిన G అక్షరం గ్లోబల్ వేరియంట్ అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే గ్లోబల్ వేరియంట్ భారత్ లో లాంచ్ కానుందని దీని ద్వారా తెలుస్తోంది. అంటే భారత్ లో ఈ డివైజ్ ని షావోమి తయారు చేసే అవకాశం లేదన్నమాట.
Xiaomi 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Xiaomi 13 6.2-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే తో రానుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఇందులో ఉండనుంది. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం. కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండనుంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో ఇతర కెమెరా లెన్సెస్ వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Xiaomi 13 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని వాడినట్లు సమాచారం. ఇది 12జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది. లీకైన రెండర్స్ ని బట్టి Xiaomi 13 స్క్వేర్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. ఫ్లాగ్షిప్ డివైజ్ కాబట్టి ఇందులో మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశం ఉంది. Xiaomi 13 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని చెబుతున్నారు.
భారత్ లో Xiaomi 13 త్వరగా లాంచ్ అయ్యే అవకాశం ఉంటే, షావోమి నుంచి త్వరలోనే ప్రకటన లేదా టీజర్ వచ్చే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.