ఫిబ్రవరి 27 న అంటే నేడు MWC 2023 ప్రారంభమైంది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ సందర్భంగా చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Xiaomi 13 Pro, Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లు ఉన్నాయి.
Xiaomi 13, Xiaomi 13 Lite ఫోన్లు భారత్ లో తర్వాత లాంచ్ కానున్నాయి. ప్రో-వర్షన్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం షావోమి అన్‌వీల్ చేసింది. సరే, ఓసారి Xiaomi 13 ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Xiaomi 13 ధర
బేస్ వేరియంట్ అయిన Xiaomi 13 ధర 999 యూరోలు గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్, ఫ్లోరా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Xiaomi 13 Lite ధర 499 యూరోలు (సుమారు రూ.43,700) గా ఉంది. ఈ ఫోన్ లైట్ బ్లూ, లైట్ పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Xiaomi 13 స్పెసిఫికేషన్స్
Xiaomi 13 డివైజ్ లో 6.36-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ వచ్చింది. 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని ఈ ఫోన్ లో అందించారు. టిపికల్ బ్రైట్నెస్ 1200 నిట్స్ గా ఉంటుంది. 413పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, హెచ్డీఆర్10+, పీ3 కలర్ గేముత్, డాల్బి విజన్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Xiaomi 13 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. టీఎస్ఎంసీ యొక్క 4 ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వాడారు. అలాగే స్నాప్ డ్రాగన్ ఎక్స్70 5జీ మోడెమ్ ని ఈ ఫోన్ లో వినియోగించారు. Xiaomi 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా విభాగం విషయానికి వస్తే, Xiaomi 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. లైకా ఈ కెమెరాల సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 మెయిన్ సెన్సర్ (హైపర్ ఓఐఎస్), 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా అందించారు.
Xiaomi 13 లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డాల్బి అట్మాస్ కి సపోర్ట్ చేసే స్పీకర్ సెటప్ ఈ ఫోన్ లో ఉంది.
Xiaomi 13 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 152.8 ఎంఎం పొడవు, 71.5 ఎంఎం వెడల్పు, 7.98 ఎంఎం మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
