Home News Snapdragon 8 Gen 2 చిప్, 50mp Sony IMX800 కెమెరాతో లాంచైన Xiaomi 13

Snapdragon 8 Gen 2 చిప్, 50mp Sony IMX800 కెమెరాతో లాంచైన Xiaomi 13

హైలైట్స్

చైనాలో Xiaomi 13 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Xiaomi 13 మరియు Xiaomi 13 Pro మోడల్స్ ని షావోమి తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన Xiaomi 12 మరియు Xiaomi 12 Pro లకి సక్సెసర్స్ గా Xiaomi 13 సిరీస్ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్ క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లైకా-బ్రాండెడ్ కెమెరాలు ఉన్నాయి.

Xiaomi 13, Xiaomi 13 Pro ధరలు, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఆదివారం నాడు జరిగిన ఈవెంట్ లో ప్రకటించారు. మనమిప్పుడు స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ఇతర వివరాలెలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 13 ధర, లభ్యత

స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర చైనాలో CNY 3999 (సుమారు రూ.47,300) తో ప్రారంభమవుతుంది. ఇక 8జిబి+256జిబి యూనిట్ ధర CNY 4299 (సుమారు రూ.51,000), 12జిబి+256జిబి వేరియంట్ ధర CNY 4599 (సుమారు రూ.55,000), 12జిబి+512జిబి మోడల్ ధర CNY 4999 (సుమారు రూ.59,200) గా ఉన్నాయి. ఇవన్నీ చైనా ధరలు కాగా, భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ధరలు మారనున్నాయి. ఇకపోతే Xiaomi 13 డివైజ్ బ్లాక్, వైట్, వైల్డర్నెస్ గ్రీన్, ఫార్ మౌంటెయిన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2400*1800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఈ ఫోన్ లో అందించారు. Xiaomi 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 13 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం Xiaomi 13 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ వైర్లెస్ రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 13 సిరీస్ లో కెమెరా సిస్టమ్ కోసం షావోమి మరియు లైకా సంస్థలు జట్టు కట్టాయి. Xiaomi 13 ఫోన్ లో లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ సెన్సర్, 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.