Home News MWC లాంచ్ ఈవెంట్‌ కన్నా ముందే లీకైన Xiaomi 13 Lite 5G ధర

MWC లాంచ్ ఈవెంట్‌ కన్నా ముందే లీకైన Xiaomi 13 Lite 5G ధర

Highlights
  • Xiaomi Civi 2 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న Xiaomi 13 Lite 5G
  • స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Xiaomi 13 Lite 5G
  • ఫిబ్రవరి 26 న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో లాంచ్ కానున్న Xiaomi 13 Lite 5G

Xiaomi 13 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచైంది. ఫిబ్రవరి 26 న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అవి: Xiaomi 13 Pro, Xiaomi 13 5G, Xiaomi 13 Lite 5G. గ్లోబల్ లాంచ్ రోజునే భారత్ లో కూడా Xiaomi 13 సిరీస్ లాంచ్ అవుతోంది.

ఇకపోతే లాంచ్ కి ముందే Xiaomi 13 Lite 5G ఫోన్ ధర వివరాలు బయటకు వచ్చాయి. టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ Xiaomi 13 Lite 5G ధరను లీక్ చేశాడు. 128జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది. మూడు కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. సరే, ఓసారి Xiaomi 13 Lite 5G ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13 Lite 5G ధర, స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 499 యూరోలు (సుమారు రూ.44,000) గా ఉండనుంది. గతేడాది చైనాలో లాంచైన Civi 2 ధర CNY 2399 (సుమారు రూ.28,900) గా ఉంది.

Xiaomi 13 Lite 5G డివైజ్ గ్లోబల్ గా బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 20ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. 32ఎంపి+32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. Xiaomi 13 Lite 5G లో లైకా కెమెరాలు రావు. అయితే Xiaomi 13, Xiaomi 13 Pro ఫోన్లలో లైకా కెమెరాలు వస్తాయి.

Xiaomi 13 Lite 5G డివైజ్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, డాల్బి విజన్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

iPhone 14 Pro డైనమిక్ ఐల్యాండ్ మాదిరి ఫీచర్ Xiaomi 13 Lite 5G లో కూడా ఉంటుంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. టైప్-సీ పోర్ట్, డాల్బి అట్మాస్, 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

భారత్ లో Xiaomi 13 Lite 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.35,000 నుంచి రూ.40,000 మధ్యలో ఉండనుంది. రానున్న రోజుల్లో మరింత సమాచారం మీకు అందజేస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.