ఫిబ్రవరి నెలలో భారత్ లో Xiaomi 13 Pro డివైజ్ రూ.79,999 ధరతో లాంచైంది. ఈ ఫోన్ కెమెరా విభాగానికి ఎక్స్‌పర్ట్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీ పరిమిత కాల డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా Xiaomi 13 Pro పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. కాగా, Xiaomi 13 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13 Pro డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Xiaomi 13 Pro సేల్ ధర
Xiaomi 13 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ భారత్ లో రూ.79,999 ధరతో లాంచైంది. ఈ డివైజ్ సిరామిక్ వైట్ మరియు సిరామిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.8,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.71,999 వద్దకి చేరుతుంది. 2023 ఏప్రిల్ నెల మొత్తం ఈ ఆఫర్ వర్తిస్తుంది. షావోమి, రెడ్మీ యూజర్లకు అదనంగా ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ రూ.69,999 కే లభిస్తుంది.
Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- హెచ్డీఆర్10+, డాల్బి విజన్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
Xiaomi 13 Pro లో 6.78-ఇంచ్ 2కే ఫ్లెక్సిబుల్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ, ప్రాసెసర్
- 4820ఎంఏహెచ్ బ్యాటరీ
- 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
- 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
Xiaomi 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ వరకు ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
కనెక్టివిటీ
- 5జీ, 4జీ
- వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ
- బ్లూటూత్ 5.3
- యూఎస్బీ టైప్-సీ
Xiaomi 13 Pro లో 5జీ, 4జీ, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. యూఎస్బీ టైప్-సీ ఆడియో, హై-రెజ్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
కెమెరా
- 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్
- 50ఎంపి టెలీఫోటో 3ఎక్స్ లెన్స్
- 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
Xiaomi 13 Pro లో లైకా బ్రాండెడ్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటిలో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 1-ఇంచ్ సెన్సర్, 50ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో మోడ్ తో) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
