హైలైట్స్:
- 6.7 అంగుళాల శాంసంగ్ ఈ6 సబ్‌స్ట్రేట్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ తో రానున్న Xiaomi 13 Pro
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే డిస్ప్లే తో రానున్న హ్యాండ్సెట్
- ఈ ఏడాది నవంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్
షావోమీ కంపెనీ షావోమీ 13 సిరీస్ లైనప్ పై పని చేయడం మొదలుపెట్టినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ సైకిల్ లో కాకుండా ఒక నెల ముందుగానే ఈ సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో మనం ఈ ఫోన్ కి సంబంధించిన రూమర్లు, లీక్స్ ని చూస్తూ వచ్చాం. అయితే తాజాగా షావోమీ 13 ప్రో ఈఈసీ ప్లాట్‌ఫామ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ వివరాలను ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది.
డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్ని బట్టి, షావోమీ 13 ప్రో 6.7 అంగుళాల శాంసంగ్ ఈ6 సబ్‌స్ట్రేట్ ఫ్లిక్సిబుల్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో పంచ్ హోల్ కటౌట్, కొంచెం క్వర్వ్డ్ ఎడ్జెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయని అంచనా వేయవచ్చు.
Xiaomi 13 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సోషల్ మీడియా మాధ్యమం వీబో లో షావోమీ 13 ప్రో ఫోన్ కి సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ 6.7 అంగుళాల శాంసంగ్ ఫ్లిక్సిబుల్ ఈ6 స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ప్రస్తుతానికి షావోమీ 13 ప్రో కి సంబంధించిన ఇంతే సమాచారం అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం, షావోమీ 13, 6.36 అంగుళాల 2.5డీ ఫ్లిక్సిబుల్ స్క్రీన్, నారో బెజెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుందని తెలిసింది. ఫోర్-వే ఇన్ఫినైట్ మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే ని షావోమీ 13 ప్రో కలిగి ఉంటుందన్నారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంటుందని అనుకోవచ్చు. ఇక ప్రో వర్షన్ బీవైడీ తయారుచేసిన సిరామిక్ బాడీ ఉంటుందని సమాచారం.
షావోమీ సొంతంగా తయారు చేసిన ఫాస్ట్ చార్జింగ్ ఐసీ షావోమీ 13 సిరీస్ లో ఉండే అవకాశముంది. అలాగే 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుందని సమాచారం. నవంబర్ లో జరిగే షావోమీ యొక్క యాన్యూవల్ మీట్ లో ఈ ఫోన్ ని లాంచ్ చేసే అవకాశముంది. ప్రస్తుతానికి షావోమీ 13 సిరీస్ కి సంబంధించిన వివరాలు రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.













