2K OLED డిస్ప్లే, 50mp టెలీఫోటో లెన్స్ తో లాంచైన Xiaomi 13 Pro

హైలైట్స్

  • చైనాలో లాంచైన Xiaomi 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • లైనప్ లో వచ్చిన Xiaomi 13 మరియు Xiaomi 13 Pro మోడల్స్
  • 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన Xiaomi 13 Pro

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. Xiaomi 13, Xiaomi 13 Pro చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆర్టికల్ లో Xiaomi 13 Pro యొక్క విశేషాలు తెలుసుకుందాం. 50ఎంపి లైకా కెమెరా సిస్టమ్, 120 హెర్ట్జ్ 2కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో Xiaomi 13 Pro వచ్చింది.

Xiaomi 13 Pro ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. త్వరలోనే భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. 2023 జనవరిలో భారత్ లో Xiaomi 13 Pro లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో షావోమి నుంచి ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన రానుంది. ఇక Xiaomi 13 Pro యొక్క దర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13 Pro ధర

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4999 (సుమారు రూ.59,200) గా ఉంది. 8జిబి + 256జిబి మోడల్ ధర CNY 5399 (సుమారు రూ.64,000), 12జిబి+256జిబి యూనిట్ ధర CNY 5799 (సుమారు రూ.68,700), 12జిబి+512జిబి వేరియంట్ ధర CNY 6299 (సుమారు రూ.74,600) గా నిర్ణయించారు.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro 6.73-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో లాంచైంది. Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. హై-రెజ్ ఆడియో, ఎక్స్-యాస్కిస్ లీనియర్ మోటర్, వేపర్ చాంబర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Xiaomi 13 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 13 Pro లో లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleSnapdragon 8 Gen 2 చిప్, 50mp Sony IMX800 కెమెరాతో లాంచైన Xiaomi 13
Next articleడిసెంబర్ 20 న లాంచ్ అవుతోన్న Infinix Zero Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.