హైలైట్స్
- త్వరలోనే లాంచ్ కానున్న Xiaomi 13 సిరీస్
- నవంబర్ మూడో వారంలో Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచ్ అవుతుందని అంచనా
- తాజాగా ఇంటర్నెట్ లో దర్శనమిచ్చిన Xiaomi 13 Pro లైవ్ ఇమేజ్
Xiaomi 13 సిరీస్ త్వరలోనే లాంచ్ అవ్వనుంది. ఇప్పటికైతే కంపెనీ నుంచి Xiaomi 13 సిరీస్ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, నవంబర్ మూడో వారంలో చైనాలో Xiaomi 13 సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ లైనప్ లో కంపెనీ కనీసం రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. అవి: Xiaomi 13 మరియు Xiaomi 13 Pro. అయితే లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాక ముందే ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్ కి సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయి.
లేటెస్ట్ లీక్ ద్వారా Xiaomi 13 Pro యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. గత మోడల్ తో పోల్చితే, Xiaomi 13 Pro లో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓసారి Xiaomi 13 Pro డిజైన్, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
లీకైన Xiaomi 13 Pro డిజైన్
Snapdragon 8 Gen 2 చిప్సెట్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ గా Xiaomi 13 Pro నిలవనుంది. నవంబర్ లో జరగబోవు సదస్సులో క్వాల్కమ్ సంస్థ ఈ చిప్సెట్ ని లాంచ్ చేయబోతోంది. ఇదిలా ఉండగా, Xiaomi 13 Pro యొక్క లైవ్ ఇమేజ్ ని TechGoing తన కథనంతో పాటు అప్‌లోడ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఎలా ఉందో తెలుస్తోంది. కెమెరా మాడ్యూల్ కొత్త డిజైన్ లో కనిపిస్తోంది. స్క్వేర్ షేప్ లో ఉన్న మాడ్యూల్, కార్నర్స్ లో కర్వ్డ్ గా ఉంది. మాడ్యూల్ లో మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. లైకా బ్రాండింగ్ ని మనం గమనించవచ్చు. Xiaomi 12 Pro వర్టికల్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. Xiaomi 13 Pro కెమెరా మాడ్యూల్ పూర్తిగా విభిన్నంగా ఉంది.
రూమర్లను బట్టి రాబోవు Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ లో 12ఎస్ అల్ట్రా లో వాడబడిన 1-ఇంచ్ సోనీ ఐఎంఎక్స్989 సెన్సర్ ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, గత మోడల్ పై ఇది భారీ అప్‌గ్రేడ్ అని చెప్పాలి. గత మోడల్ 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ప్రస్తుతానికి Xiaomi 13 Pro కి సంబంధించిన ఇతర కెమెరా స్పెసిఫికేషన్స్ తెలియలేదు.
ఇమేజ్ ద్వారా మనకు Xiaomi 13 Pro యొక్క సిల్వర్ కలర్ వేరియంట్ కనిపిస్తోంది. ఫ్రేమ్ లో కర్వ్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్ కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్
రీసెంట్ గా Xiaomi 13 Pro యొక్క లైవ్ ఇమేజ్ ద్వారా ఫ్రంట్ ప్యానెల్ లుక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ద్వారా ఫోన్ హోల్-పంచ్ కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్ కలిగి ఉన్నట్లు తెలిసింది. Xiaomi 13 Pro 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే Xiaomi 13 Pro లో 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంటుందని చెబుతున్నారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో Xiaomi 13 Pro వస్తుందని అంచనా వేస్తున్నారు.
Xiaomi 13 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఇటీవలె ఈ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని తెలిసింది. స్టాండర్డ్ వేరియంట్ అయిన Xiaomi 13 ఈ వెబ్ సైట్ పై 2211133C అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ వేరియంట్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.