Home News డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్

డిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్

హైలైట్స్

Xiaomi 13 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. డిసెంబర్ 11 న రాత్రి 7 గంటలకు ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అసలైతే షావోమి 13 సిరీస్ లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 1 న జరగాల్సింది. కానీ చైనా మాజీ లీడర్ జియాంగ్ జెమిన్ మరణంతో ఈవెంట్ ని వాయిదా వేశారు. Xiaomi 13 మరియు Xiaomi 13 Pro డివైజెస్ రెండు కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్నాయి.

ఇన్వైట్ ఇమేజ్ టీజర్ ద్వారా Xiaomi 13 బాక్సీ డిజైన్ లో ఉంటుందని తెలుస్తోంది. అంటే ఐఫోన్స్ మాదిరి అన్నమాట. మరోవైపు Xiaomi 13 Pro కర్వ్డ్ డిస్ప్లేతో రౌండెడ్ ఎడ్జెస్ తో కనిపిస్తోంది. రెండు ఫోన్లూ కూడా రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 6.2-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డీసీ డిమ్మింగ్, ఫ్లాట్ ఎడ్జెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Xiaomi 13 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ఓఐఎస్ మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు 32ఎంపి కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 13 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

Xiaomi 13 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుందని అంచనా. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Xiaomi 13 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమీరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.