
చైనాతో పాటు హాంకాంగ్ వంటి కొన్ని మార్కెట్స్ లో లాంచైన Xiaomi 13 Ultra డివైజ్ తాజాగా వెస్టర్న్ యూరప్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, డాల్బి విజన్ సపోర్ట్, భారీ వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా, 1-ఇంచ్ అల్ట్రా-లార్జ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్ (వేరియబుల్ అపర్చర్) ఉన్నాయి. Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవ్వనుందో అనే విషయాన్ని షావోమి సంస్థ ఇప్పటి వరకు వెల్లడించలేదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Xiaomi 13 Ultra ధర, సేల్
- Xiaomi 13 Ultra 12జిబి+512జిబి వేరియంట్ ధర యూరప్ లో 1,499.99 యూరోలు (సుమారు రూ.1,33,200) గా ఉంది.
- లాంచ్ ఆఫర్ లో భాగంగా, షావోమి 140 యూరోలు (సుమారు రూ.13,400) విలువగల ఇన్‌స్టంట్ ఫోటో ప్రింటర్ ని షావోమి ఆఫర్ చేస్తోంది.
Xiaomi 13 Ultra స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Xiaomi 13 Ultra లో 6.73-ఇంచ్ 2కే అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- చిప్సెట్: Xiaomi 13 Ultra లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13 Ultra లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Xiaomi 13 Ultra ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Xiaomi 13 Ultra లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- రియర్ కెమెరా: Xiaomi 13 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, హైపర్-ఓఐఎస్, 8పి లెన్స్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వేరియబుల్ అపర్చర్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి సోని ఐఎంఎక్స్858 అల్ట్రా వైడ్ కెమెరా, 50ఎంపి ఓఐఎస్ సూపర్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: Xiaomi 13 Ultra లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Xiaomi 13 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఐపీ రేటింగ్: Xiaomi 13 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది.
- ఇతర ఫీచర్లు: Xiaomi 13 Ultra లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.











