Xiaomi 13 Lite డివైజ్ ని షావోమి సంస్థ MWC 2023 ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ తో పాటు ఇంకా టాప్ మోడల్ Xiaomi 13 Pro, Xiaomi 13 స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. Xiaomi 13 Lite విషయానికి వస్తే, ఈ డివైజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ అయ్యాయి. లుక్ చూస్తుంటే Apple iPhone 14 Pro మాదిరి కనిపిస్తోంది.
Xiaomi 13 Lite లో 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
Xiaomi 13 Lite స్పెసిఫికేషన్స్
- 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
- 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా
- 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400 x 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గ్లాస్ ఉన్నాయి.
Xiaomi 13 Lite లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ లో అడ్రెనో644 జీపీయూ వాడారు. ఫోన్ ని వేడిమి నుంచి రక్షించేందుకు 2360ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ చాంబర్ ని అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Xiaomi 13 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 40 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Xiaomi 13 Lite లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ప్రైమరీ కెమెరా + 8ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 159.2 ఎంఎం పొడవు, 72.7 ఎంఎం వెడల్పు, 7.23 ఎంఎం మందం, 171 గ్రాముల బరువు ఉంటుంది.
Xiaomi 13 Lite ధర
Xiaomi 13 Lite డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభిస్తుంది. Xiaomi 13 Lite డివైజ్ ధర 499 యూరోలు (సుమారు రూ.43,500) తో మొదలవుతుంది. Xiaomi 13 Lite స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, లైట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
