ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా తన కొత్త స్మార్ట్ ఫోన్లు Xiaomi 13T మరియు Xiaomi 13T Pro లను లాంచ్ చేసింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఈవెంట్ లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లతో పాటు Xiaomi Band 8 కూడా లాంచ్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ ఫోన్లకు సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లైకా బ్రాండ్ కెమెరాలతో ఈ సిరీస్ లాంచైంది.
రీసెంట్ గా చైనాలో లాంచైన Redmi K60 Ultra కి గ్లోబల్ వర్షన్ గా Xiaomi 13T Pro వచ్చినట్లు సమాచారం. అయితే షావోమి Xiaomi 13T Pro డివైజ్ ని మెరుగైన కెమెరాలు, డిజైన్ తో తీసుకొచ్చింది. సరే, ఓసారి Xiaomi 13T Pro, Xiaomi 13T డివైజెస్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Xiaomi 13T, Xiaomi 13T Pro ధర, లభ్యత
Xiaomi 13T 649 యూరోలు (సుమారు రూ.57,400) తో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి + 256జిబి వేరియంట్ ధర. ఈ డివైజ్ మీడో గ్రీన్, బ్లాక్, ఆల్పైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దేశాన్ని బట్టి ధర మారుతుంది.
మరోవైపు Xiaomi 13T Pro 12జిబి + 256జిబి మోడల్ ధరను 799 యూరోలు (సుమారు రూ.70,700) గా నిర్ణయించారు. Xiaomi 13T Pro డివైజ్ మీడో గ్రీన్, ఆల్పైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. గ్లోబల్ గా Xiaomi 13T సిరీస్ లభ్యతను గురించి షావోమి నుంచి ఇంకా ప్రకటన రాలేదు.
Xiaomi 13T, Xiaomi 13T Pro డిజైన్
రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఒక తరహా డిజైన్ ని కలిగి ఉన్నాయి. ఈ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇంకా లైకా బ్రాండింగ్ ఉంది. మెరుగైన కెమెరా ఔట్‌పుట్ కోసం ఈ ఫోన్లలో షావోమి ఇమేజింగ్ ఇంజిన్ వాడారు.
Xiaomi 13T స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Xiaomi 13T లో 6.67-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
- చిప్సెట్: Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్, మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఉన్నాయి.
- మెమొరీ: Xiaomi 13T లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్వేర్: Xiaomi 13T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Xiaomi 13T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్ 707 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 లెన్స్ అందించారు.
- బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Xiaomi 13T లో 5జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5.0గిగాహెర్ట్జ్, ఎన్ఎఫ్సీ, ఐఆర్-బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Xiaomi 13T Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ క్రిస్టల్ రెజ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Xiaomi 13T Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ వాడారు.
- మెమొరీ: Xiaomi 13T Pro డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Xiaomi 13T Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్ 707 ఓఐఎస్ లెన్స్, 50ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ50డీ టెలీఫోటో లెన్స్, 12ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ13బి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి సోని ఐఎంఎక్స్ 596 సెన్సర్ అందించారు.
- బ్యాటరీ: Xiaomi 13T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Xiaomi 13T Pro లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
