FCC సైట్ లో లిస్ట్ అయిన Xiaomi 13T; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13T
  • FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13T
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో రానున్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలోనే Xiaomi 13T సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో Xiaomi 13T, Xiaomi 13T Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Xiaomi 13T డివైజ్ FCC సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సెప్టెంబర్ లో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, లాంచ్ టైమ్‌లైన్, అంచనా స్పెసిఫికేషన్స్, ధరకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం.

Xiaomi 13T FCC లిస్టింగ్

  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, Xiaomi 13T డివైజ్ 2306EPN60G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.
  • Xiaomi 13T స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో వస్తోంది.
  • బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • సర్టిఫికేషన్ లిస్టింగ్ లో సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా ఉన్నాయి. ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుందని సమాచారం.
  • ఇవి కాకుండా మరే ఇతర సమాచారం కూడా FCC సర్టిఫికేషన్ ద్వారా తెలియలేదు. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Xiaomi 13T లాంచ్ టైమ్, ధర (లీక్)

లీక్ ప్రకారం, Xiaomi 13T స్మార్ట్ ఫోన్ తొలుత గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ డివైజ్ సెప్టెంబర్ మొదటి వారంలో ఎంట్రీ ఇస్తుందని టాక్. తర్వాత భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఇక Xiaomi 13T ధర గురించి మాట్లాడితే, 599 యూరోలు (సుమారు రూ.62,000) గా ఉంటుందని సమాచారం. ఇండియన్ మార్కెట్ లో ఈ ధర మారే అవకాశం ఉంది. Xiaomi 13T డివైజ్ బ్లాక్ మరియు ఇతర కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ లో అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: Xiaomi 13T డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T హ్యాండ్సెట్ లో లైకా ట్యూన్డ్ కెమెరా సిస్టమ్ ఉంటుందని సమాచారం. అయితే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.