
స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో 13T ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈలోగా గ్లోబల్ లాంచ్ వివరాలు వచ్చాయి. Xiaomi 13T Pro సెప్టెంబర్ 1 న గ్లోబల్ గా లాంచ్ కానుందని ఓ వార్త బయటకు వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13T Pro లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
లీకైన Xiaomi 13T Pro గ్లోబల్ లాంచ్ తేదీ
టెక్ సైట్ 4gnews Xiaomi 13T Pro ఫ్లాగ్షిప్ కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. అవేంటో క్రింద చూడండి.
- సెప్టెంబర్ 1 న యూరప్ లో Xiaomi 13T Pro డివైజ్ ని షావోమి లాంచ్ చేయనుందని సమాచారం.
- గ్లోబల్ గా Xiaomi 13T Pro డివైజ్ Redmi K60 Ultra కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోందని తెలుస్తోంది.
- అయితే ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. దీంతో లీకైన సమాచారం ఎంతవరకు నిజమో చెప్పలేం.
Xiaomi 13T Pro ధర (లీక్)
రీసెంట్ గా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పొరబాటున Xiaomi 13T Pro ధర మరియు లభ్యత వివరాలను షేర్ చేసింది. Xiaomi 13T Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 799 యూరోలు (సుమారు రూ.84,272) ధర ఉంటుందని ఆ పోస్ట్ ద్వారా తెలిసింది. మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ లభించనుంది.
Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ క్రిస్టల్రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్ ఉంటుంది.
- స్టోరేజీ: Xiaomi 13T Pro డివైజ్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి + 256జిబి, 12జిబి + 512జిబి, 16జిబి + 1టిబి.
- కెమెరా: Xiaomi 13T Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
- బ్యాటరీ: Xiaomi 13T Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











