ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Xiaomi కొన్ని రోజుల్లో తన ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. బార్సిలోనా నగరంలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో Xiaomi 13 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం షావోమి లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే రోజున ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీల డివైజెస్ కూడా లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే Xiaomi 13 సిరీస్ చైనాలో లాంచైన సంగతి తెలిసిందే.
తాజాగా Xiaomi 13T సిరీస్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఎస్-సిరీస్ ని నిలిపివేసి Xiaomi 13T సిరీస్ ని లాంచ్ చేయాలని షావోమి భావిస్తున్నట్లు ఒక టిప్‌స్టర్ ద్వారా తెలిసింది. Xiaomi 13T ఇదే ఏడాది లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇంకా లాంచ్ కావాల్సి ఉన్న Redmi K60 Extreme ఎడిషన్ కి Xiaomi 13T రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా రానుందని సమాచారం. గతంలో Redmi K50 Extreme ని కూడా Xiaomi 12T Pro గా లాంచ్ చేసింది. అయితే 12T Pro లో 200 ఎంపి కెమెరాని వాడగా, K50 Extreme లో 108ఎంపి కెమెరా వాడారు.
ప్రస్తుతం ఉన్న Xiaomi 13 డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. గతేడాది వచ్చిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 కి ఇది అప్‌గ్రేడ్ అని చెప్పాలి. కాస్త తక్కువ బడ్జెట్ లో రానున్న Xiaomi 13T సిరీస్ ఈ ఏడాది గ్లోబల్ గా లాంచ్ కానుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
Xiaomi 12T స్పెసిఫికేషన్స్
Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, మాలి-జీ610 6-కోర్ జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై Xiaomi 12T పని చేస్తుంది. Xiaomi 12T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.
ఇప్పుడు Xiaomi 12T కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.
