అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • చైనాలో అవసరమైన సర్టిఫికేషన్ పొందిన Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో రానున్న Xiaomi 14, Xiaomi 14 Pro
  • 120 వాట్ చార్జింగ్ తో వస్తోన్న Xiaomi 14 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ రానున్నాయి. నవంబర్ నెలలో ఈ సిరీస్ లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అంతకన్నా ముందే లాంచ్ ఉంటుందని తాజాగా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 సిరీస్ లాంచ్ తేదీ

Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ అక్టోబర్ 27 న చైనాలో లాంచ్ కానున్నాయని ITHome ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇంకా షావోమి నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అక్టోబర్ 24 నుంచి 26 వరకు హవాయి లో స్నాప్ డ్రాగన్ సమ్మిట్ జరగనుంది. ఇదే ఈవెంట్ లో క్వాల్కమ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ చిప్సెట్ Snapdragon 8 Gen 3 ని లాంచ్ చేయనుంది. ఆ తర్వాత వెనువెంటనే షావోమి తన Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. 8 జెన్ 3 చిప్ తో లాంచ్ కాబోయే తొలి స్మార్ట్‌ఫోన్ తమదే కావాలని షావోమి ఆరాటపడుతున్నట్లు అర్థమవుతోంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi 14 Pro లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీమ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
Previous articleలీకైన Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్, రెండర్స్
Next article2.4-ఇంచ్ డిస్ప్లే, 2,000mAh బ్యాటరీతో లాంచైన JioBharat B1; ధర చాలా తక్కువ!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.