Xiaomi 14 సిరీస్ గత వారం చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో రెండు డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. అవి: Xiaomi 14 Pro మరియు Xiaomi 14. ఈ సిరీస్‌లోని టాప్-ఎండ్ ఫోన్ అయిన Xiaomi 14 Ultra ఇంకా లాంచ్ కాలేదు. కొన్ని రోజుల్లో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే Xiaomi సంస్థ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Xiaomi 14 భారత్ కి చెంది బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో భారత లాంచ్ పై క్లారిటీ వచ్చింది. సరే, ఓసారి Xiaomi 14 బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Xiaomi 14 BIS లిస్టింగ్ వివరాలు
- తాజాగా స్టాండర్డ్ మోడల్ Xiaomi 14 భారతదేశంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్సైట్లో కనిపించింది.
- ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కావచ్చని దీని ద్వారా స్పష్టమవుతోంది.
- భారతదేశంలోని BIS ధృవీకరణ వెబ్సైట్లో “23127PN0CG” మోడల్ నంబర్‌తో Xiaomi 14 గుర్తించబడింది. మోడల్ నంబర్ చివరిలో ఉన్న ‘G’ ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తుంది.
- సాధారణంగా, Xiaomi ఫోన్ల యొక్క భారతీయ వేరియంట్లు చివరలో “I”తో వస్తాయి.
- Xiaomi త్వరలో Xiaomi 14ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని మరియు కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్‌ను పొందే మొదటి కొన్ని మార్కెట్లలో భారతదేశం ఒకటి కావచ్చునని ఈ జాబితా ధృవీకరిస్తోంది.
- మోడల్ నంబర్ తో పాటు హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ బీఐఎస్ లిస్టింగ్ లో పేర్కొనబడ్డాయి. ఇవి కాకుండా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
సరే, ఓసారి Xiaomi 14 చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
Xiaomi 14 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, (2670*1200 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
- మెమొరీ: Xiaomi 14 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
- కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 3.2x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- సాఫ్ట్వేర్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Xiaomi 14 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4610 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- బరువు: Xiaomi 14 డివైజ్ 193 గ్రాముల బరువు ఉంటుంది.
