ప్రస్తుతం Xiaomi 13T సిరీస్ స్మార్ట్ ఫోన్లపై షావోమి సంస్థ పని చేస్తోంది. ఈ సిరీస్ లో Xiaomi 13T, Xiaomi 13T Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా షావోమి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 సిరీస్ కి సంబంధించిన కెమెరా, స్టోరేజీ వివరాలు లీక్ అయ్యాయి. చైనీస్ సోషల్ మీడియా వీబో పై ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Xiaomi 14 డివైజ్ కెమెరా, స్టోరేజీ వివరాలను షేర్ చేసింది. అంతేకాదు, Xiaomi 14 నమూనా చిత్రాన్ని కూడా పంచుకుంది.
Xiaomi 14 స్పెసిఫికేషన్స్ (రూమర్స్)
- కెమెరా: డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా అప్‌కమింగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Xiaomi 14 కెమెరా, స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. Xiaomi 14 50ఎంపి ప్రైమరీ కెమెరాతో రానున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది. ఈ ప్రైమరీ సెన్సర్ 1/1.28″ సెన్సర్ కలిగి ఉంటుందని తెలిసింది. ప్రైమరీ కెమెరాకి తోడు ఒక టెలీఫోటో లెన్స్ ఉంటుందని లీక్‌స్టర్ తెలిపింది. ఈ లెన్స్ మెరుగైన జూమింగ్ ఫలితాలను అందించనుంది.
- స్టోరేజీ: షావోమి సంస్థ తన అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్లను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేయనుందని సమాచారం. ఇవి స్ట్రైట్ లేదా కర్వ్డ్ ప్యానెల్స్ తో రానున్నాయి. షావోమి కంపెనీ, 1టిబి స్టోరేజీ ఆప్షన్ తో కూడా ఒక మోడల్ ని లాంచ్ చేయనుందని సమాచారం.
- డిజైన్: ఇదివరకు వచ్చిన Xiaomi 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లు గరిష్టంగా 512జిబి వరకు మెమొరీ ఆప్షన్ కలిగి ఉన్నాయి. స్కీమాటిక్స్ ని బట్టి Xiaomi 14 ఫోన్ అల్ట్రా-న్యారో బెజెల్స్ తో రానుందని తెలుస్తోంది. అలాగే సెంటర్డ్ పంచ్-హోల్, టాప్ లో మైక్రోఫోన్ ని నమూనా చిత్రంలో చూడవచ్చు.
- బ్యాటరీ: Xiaomi 14 స్టాండర్డ్ మోడల్ 4860 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు సమాచారం.
- చిప్సెట్: Xiaomi 14 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే Xiaomi 14 చైనీస్, గ్లోబల్ యూనిట్స్ ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.
