Xiaomi 14 CIVI: లీకైన షావోమి 14 సీవీ రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • జూన్ 12న భారత్ లో Xiaomi 14 CIVI లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ రిటైల్ బాక్స్
  • రివీలైన షావోమి 14 సీవీ స్పెసిఫికేషన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో సీవీ సిరీస్ ను భారత్‌కి పరిచయం చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14 CIVI డివైజ్ ను తొలుత మార్కెట్ లోకి షావోమి విడుదల చేస్తోంది. జూన్ 12వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో షావోమి 14 సీవీ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Xiaomi 14 CIVI స్పెసిఫికేషన్స్ (లీకైన బాక్స్ నుంచి)

డిస్ప్లే: Xiaomi 14 CIVI లో క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. ఇది 1.5కే రెజుల్యూషన్ గల అమోలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. ఫ్రంట్ నాచ్ లో రెండు కెమెరాలు ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 14 CIVI లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్.

బ్యాటరీ: Xiaomi 14 CIVI లో బ్యాటరీ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రిటైల్ బాక్స్ ప్రకారం, ఈ ఫోన్ డబుల్ బ్యాటరీ లైఫ్‌స్పాన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుందని అర్థం.

కలర్ ఆప్షన్స్: Xiaomi 14 CIVI మూడు రంగుల్లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. క్రూజ్ బ్లూ, మచ్చా గ్రీన్ మరియు షాడో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 CIVI లో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 32ఎంపి + 32ఎంపి సెన్సర్స్ ఉంటాయి. ప్రైమరీ సెన్సర్ f/2.0 అపర్చర్, 2x పొట్రెయిట్ సపోర్ట్ తో వస్తోంది. సెకండరీ సెన్సర్ 100 డిగ్రీస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. ఇది f/2.4 అపర్చర్, యాంటీ-షేక్ ఏఐ, ఈఐఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

రియర్ కెమెరా: Xiaomi 14 CIVI లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, ఒక వైడ్ యాంగిల్ లెన్స్, ఒక మ్యాక్రో కెమెరా ఉంటాయి.