
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra ఫోన్లు రానున్నాయి. తాజాగా Xiaomi 14 Pro డివైజ్ యొక్క హై-క్వాలిటీ 5కే రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో లీక్ అయ్యాయి. వీటి ద్వారా Xiaomi 14 Pro డివైజ్ అన్ని యాంగిల్స్ లో ఎలా ఉంటుందో తెలిసిపోయింది. టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్ట్‌ఆఫర్ (OnLeaks) ద్వారా ఈ రెండర్స్, వీడియో లీక్ అయ్యాయి.
Xiaomi 14 Pro డిజైన్ వివరాలు
- లీకైన Xiaomi 14 Pro రెండర్స్ ని బట్టి, డివైజ్ గత మోడల్ కి కాస్త విభిన్నంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈసారి Xiaomi 14 Pro లో కర్వ్డ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. గత మోడల్ Xiaomi 13 Pro తో పోల్చితే Xiaomi 14 Pro డివైజ్ చాలా మందంగా ఉంది. కెమెరా మాడ్యూల్ కూడా భారీగా ఉంది.
- Xiaomi 14 Pro డివైజ్ 161.6 మి.మీ పొడవు, 75.3 మి.మీ వెడల్పు, 8.7 మి.మీ మందం ఉంటుందని రెండర్స్ ని బట్టి తెలుస్తోంది.
- కెమెరా మాడ్యూల్ 13.1 మి.మీ ఎత్తు కనిపిస్తోంది. మాడ్యూల్ లో 4 సెన్సర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
- ఇకపోతే Xiaomi 14 Pro డిస్ప్లే 6.6-ఇంచ్ 2.5డి ఫ్లాట్ డిజైన్ మరియు పంచ్-హోల్ కటౌట్ తో కనిపిస్తోంది.
Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.6-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
- కెమెరా: Xiaomi 14 Pro లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
- బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, ఐపీ రేటింగ్ ఉంటాయి.











