IMEI డేటాబేస్ పై కనిపించిన Xiaomi 14, 14 Pro; 2023 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించిన షావోమి 14 సిరీస్ గ్లోబల్, చైనీస్ వేరియంట్స్
  • Xiaomi 14 మోడల్ నంబర్స్: 23127PN0CC, 23127PN0CG
  • Xiaomi 14 Pro మోడల్ నంబర్స్: 23116PN5BC, 23116PN5BG

గత నెలలో షావోమి సంస్థ తన ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ని యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు షావోమి సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందు, షావోమి యొక్క రాబోవు ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. GSMChina వెబ్ సైట్ తొలుత Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని ఐఎంఈఐ డేటాబేస్ పై గుర్తించింది.

షావోమి 14, షావోమి 14 ప్రో డివైజెస్ మోడల్ నంబర్స్ ఇలా ఉన్నాయి. షావోమి 14 ప్రో మోడల్ నంబర్స్: 2311PN5BC (సీ అంటే చైనీస్ వేరియంట్), 23116PN5BG (జీ అంటే గ్లోబల్ వేరియంట్). షావోమి 14 మోడల్ నంబర్స్: 23127PN0CC, 23127PN0CG. 2311, 2312 నంబర్లను బట్టి, షావోమి 14 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో చైనీస్ మార్కెట్ లోకి లాంచ్ అవుతాయని అంచనా వేయవచ్చు.

Xiaomi 14, 14 Pro చిప్సెట్

  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3

Xiaomi 14, 14 Pro స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రాసెసర్ కోడ్ నేమ్ లిస్టింగ్ లో పైనాపిల్ అని ఉన్నట్లు GSMChina పేర్కొంది. మరోవైపు క్వాల్కమ్ సంస్థ ఇంకా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని లాంచ్ చేయలేదు. కానీ, ఒక లీక్ ప్రకారం, 2023 అక్టోబర్ లో ఈ ప్రాసెసర్ లాంచ్ కానున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. Xiaomi 14 Pro డివైజ్ క్వాల్కమ్ ఎస్ఎమ్8650 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలిపింది.

Xiaomi 14 Pro బ్యాటరీ, డిస్ప్లే

  • 5000 ఎంఏహెచ్
  • 50వాట్ వైర్లెస్

Xiaomi 14 Pro డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. 14 ప్రో రెండు వేరియంట్స్ లో రానుండగా, వీటిలో ఒకటి ఫ్లాట్ స్క్రీన్ మరొకటి కర్వ్డ్ స్క్రీన్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ స్క్రీన్ వేరియంట్ 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. మరోవైపు కర్వ్డ్ స్క్రీన్ మోడల్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

Xiaomi 14 సిరీస్ కెమెరా

  • WLG High-Lens

Xiaomi 14 సిరీస్ లో షావోమి సంస్థ WLG హై లెన్స్ ని సెన్సర్స్ ని వాడనున్నట్లు సమాచారం. అలాగే లైకా తో తన భాగస్వామ్యాన్ని షావోమి కొనసాగిస్తుందని భావించవచ్చు. ఈ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.