ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 15 ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తాజాగా Xiaomi 15 సిరీస్ లో రానున్న Xiaomi 15 మరియు Xiaomi 15 Pro ఫోన్ల యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Xiaomi 15, Xiaomi 15 Pro చిప్సెట్, డిస్ప్లే
- డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Xiaomi 15 డివైజ్ 6.36-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2500*1200 పిక్సెల్స్), ఎల్టీపీవో ప్యానెల్, 1హెర్ట్జ్-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. Xiaomi 15 సిరీస్ 2024 ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- ఈ డివైజెస్ లో 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని టిప్‌స్టర్ డీసీఎస్ తెలిపింది.
- బ్రైట్నెస్ మరియు స్క్రీన్ రెజుల్యూషన్ ఇంప్రూవ్మెంట్స్ వల్లన పవర్ వినియోగం 15 నుంచి 20 శాతం మేర తగ్గుతుందని టిప్‌స్టర్ తెలిపింది.
- Xiaomi 15 సిరీస్ సీఎస్ఓటీ ఎల్ఈడీ ప్యానెల్స్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- మరోవైపు, Xiaomi 15 Pro డివైజ్ గత మోడల్ Xiaomi 14 Pro కంటే సన్నని బెజెల్స్ తో వస్తుందని తెలుస్తోంది. Xiaomi 14 Pro లో 0.9ఎంఎం బెజెల్స్ ఉండగా, Xiaomi 15 Pro లో 0.6ఎంఎం బెజెల్స్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.
- Xiaomi 15 Pro మోడల్ 2కే రెజుల్యూషన్ గల అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం.
Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.6-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
- కెమెరా: Xiaomi 14 Pro లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
- బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, ఐపీ రేటింగ్ ఉంటాయి.
