హైలైట్స్:
- Xiaomi Civi 2 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన షావోమీ
- స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- ప్రస్తుతం చైనా మార్కెట్ కే పరిమితం కానున్న Xiaomi Civi 2, త్వరలో గ్లోబల్ మార్కెట్స్ కి విస్తరించే అవకాశం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ, Xiaomi Civi 2 అనే స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Xiaomi Civi 2 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Xiaomi Civi 2 ధర, స్పెసిఫికేషన్స్
Xiaomi Civi 2 లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 402 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. Xiaomi Civi 2 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 12 ఆధారంగా పని చేస్తుంది. ఇక ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ని అమర్చారు. ఈ చిప్ 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది. అలాగే ఇది 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్. Xiaomi Civi 2 లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.
Xiaomi Civi 2 డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ కనెక్టివిటీ కలిగి ఉంది. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi Civi 2 లో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీని వాడారు. దీని వల్లన గేమ్స్ ఆడేప్పుడు నిరవధికంగా వీడియోలు చూసేప్పుడు ఫోన్ వేడెక్కదు.
ఇప్పుడు Xiaomi Civi 2 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi Civi 2 లో 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాలు డిస్ప్లే పై పిల్ షేప్ నాచ్ ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు కెమెరాల్లో ఒకటి 100 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన వైడ్ యాంగిల్ కెమెరా.
Xiaomi Civi 2 రియర్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 20ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
Xiaomi Civi 2 చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ అయిన 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,399 (దాదాపు రూ.27,299) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజీ యూనిట్ ధర RMB 2,499 (దాదాపు రూ.28,500) గా నిర్ణయించారు. ఇక 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర RMB 2,799 (దాదాపు రూ.31,900) గా ఉంది. Xiaomi Civi 2 బ్లాక్, బ్లూ, సిల్వర్, పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.