ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi చైనాలో Civi 4 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో వచ్చిన తొలి ఫోన్ Civi 4 Pro కావడం విశేషం. కెమెరా విభాగం కూడా చెప్పుకోదగిన విధంగా ఉంది. ఈ ఫోన్ లో మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. ఇందులో 2 కెమెరాలు ముందు వైపు ఉండగా, మరొక 3 వెనకాల ఉన్నాయి. సరే, ఓసారి Civi 4 Pro యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Xiaomi Civi 4 Pro ధర
Xiaomi Civi 4 Pro స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Xiaomi Civi 4 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,999 యువాన్లు (సుమారు రూ.35,000) గా నిర్ణయించారు.
Xiaomi Civi 4 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ.38,500) గా ఉంది.
Xiaomi Civi 4 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ యూనిట్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.42,000) గా ఉంది.
Xiaomi Civi 4 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో స్ప్రింగ్ వైల్డ్ గ్రీన్, సాఫ్ట్ మిస్ట్ పింక్, బ్రీజ్ బ్లూ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Xiaomi Civi 4 Pro లో 6.55-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2750*1236 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
- ప్రాసెసర్: Xiaomi Civi 4 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
- కెమెరా: Xiaomi Civi 4 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి + 32ఎంపి కెమెరాలు ఉన్నాయి.
- బ్యాటరీ: Xiaomi Civi 4 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Xiaomi Civi 4 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కనెక్టివిటీ: Xiaomi Civi 4 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
