ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఇది షావోమి యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్ 4-ఇంచ్ భారీ కవర్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఓసారి ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.
Xiaomi MIX Flip ధర, లభ్యత
Xiaomi MIX Flip స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర 1299 యూరోలు (సుమారు రూ.1,21,000) గా ఉంది.
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం యూరప్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఇతర మార్కెట్స్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.
Xiaomi MIX Flip డివైజ్ బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Xiaomi MIX Flip స్పెసిఫికేషన్స్
ఇంటర్నల్ స్క్రీన్: Xiaomi MIX Flip లో 6.86-ఇంచ్ ఎల్టీపీవో 1.5కే క్రిస్టల్‌రెజ్ డిస్ప్లే, 2912*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్, 3000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్, యూటీజీ గ్లాస్ ఉన్నాయి.
ఔటర్ డిస్ప్లే: Xiaomi MIX Flip లో 4-ఇంచ్ 1.5కే క్రిస్టల్‌రెజ్ స్క్రీన్, 1392*1280 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్, 3000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, షావోమి గ్లాస్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
చిప్సెట్: Xiaomi MIX Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ ఇచ్చారు.
ర్యామ్, స్టోరేజీ: Xiaomi MIX Flip డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వచ్చింది.
కెమెరా: Xiaomi MIX Flip లో 50ఎంపి లైట్ ఫ్యూజన్ 800 ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి60ఏ40 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Xiaomi MIX Flip లో పవర్ బ్యాకప్ కోసం 4780 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Xiaomi MIX Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4 ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Xiaomi MIX Flip డివైజ్ 167.5 మి.మీ పొడవు, 74.02 మి.మీ వెడల్పు, 16.19 మి.మీ మందం (మడిచినప్పుడు), 7.8 మి.మీ మందం (తెరిచినప్పుడు), 192 గ్రాముల బరువు ఉంటుంది.
