Home News రివీలైన Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, MIX Fold 3 లాంచ్ టైమ్‌లైన్

రివీలైన Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, MIX Fold 3 లాంచ్ టైమ్‌లైన్

Highlights
  • చైనాలో ఆగస్టులో లాంచ్ కానున్న డివైజెస్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న ప్యాడ్ 6 మ్యాక్స్
  • కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీలో తయారు కానున్న Xiaomi MIX Fold 3

షావోమి ప్రెసిడెంట్ లు వీబింగ్ షావోమి తదుపరి ఫోల్డబుల్ ఫోన్ గురించి బిగ్ హింట్ ఇచ్చారు. కంపెనీ Xiaomi Pad 6 కి మ్యాక్స్ వర్షన్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇది ఐప్యాడ్ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా లైనప్ కి గట్టి పోటీ ఇచ్చేందుకేనని అర్థమవుతోంది. Xiaomi Pad 6 Max రీసెంట్ గా బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్, చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. రెండు లిస్టింగ్స్ కూడా దాదాపుగా ఒకే విధమైన వివరాలను అందించాయి. Mix Fold 3 లాంచ్ ఈవెంట్ పలు ఉత్పత్తులను షావోమి లాంచ్ చేయనుందని Xiaomiui ఒక కథనాన్ని వెలువరించింది.

Xiaomi MIX Fold 3 లాంచ్ టైమ్ లైన్ గురించి అడిగినప్పుడు, చైనాలో ఆగస్టులో లాంచ్ ఉంటుందని వీబింగ్ తెలిపారు. ఈ డివైజ్ రీసెంట్ గా చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. మరోవైపు Xiaomiui తన కథనంలో Redmi K60 Ultra లాంచ్ కూడా ఆగస్టులో ఉంటుందని తెలిపింది.

Xiaomi MIX Fold 3 స్పెసిఫికేషన్స్