Home News Xiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip

Xiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip

Highlights
  • చైనాలో MIX Fold 4, MIX Flip లాంచ్
  • ఓఎల్ఈడీ ప్యానెల్, 3000 నిట్స్ బ్రైట్నెస్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన హోమ్ మార్కెట్ చైనాలో MIX Fold 4, MIX Flip ఫోల్డబుల్ ఫోన్లను నేడు లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్ కే పరిమితం కానున్నాయి. భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం MIX Fold 4, MIX Flip ఫోల్డబుల్ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Xiaomi MIX Fold 4 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi MIX Fold 4 లో 6.56-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్ ఔటర్ డిస్ప్లే, 7.98-ఇంచ్ ఇన్నర్ స్క్రీన్, 2488*2224 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, హెచ్డీఆర్ వివిడ్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి.

చిప్సెట్: Xiaomi MIX Fold 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. అల్ట్రా-థిన్ వీసీ సిస్టమ్ ఇందులో అందించారు.

రియర్ కెమెరా: Xiaomi MIX Fold 4 లో లైకా బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ 800 ఓఐఎస్ కెమెరా + 12ఎంపి అల్ట్రావైడ్ ఒవి13బి10 లెన్స్ + 50ఎంపి టెలీఫోటో ఒవి60ఏ40 3ఎక్స్ జూమ్ కెమెరా, 10ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో శాంసంగ్ ఎస్5కే3కే1 5ఎక్స్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: Xiaomi MIX Fold 4 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఒమ్నివిజన్ ఒవి16ఎఫ్40 కెమెరాను ఇంటర్నల్ స్క్రీన్ పై అందించారు. ఎక్స్‌టర్నల్ డిస్ప్లేపై 20ఎంపి ఒమ్నివిజన్ ఒవి16ఎఫ్40 లెన్స్ ఇచ్చారు.

బ్యాటరీ: Xiaomi MIX Fold 4 లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ వైర్డ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Fold 4 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Xiaomi MIX Fold 4 లో వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫీచర్లు, టూ-వే శాటిలైట్ కనెక్టివిటీ, ఐపీఎక్స్8 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

Xiaomi MIX Flip స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ డిస్ప్లే: Xiaomi MIX Flip లో 6.86-ఇంచ్ ఫోల్డబుల్ ఓఎల్ఈడీ టీసీఎల్ సీ8+ ఎల్టీపీవో స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (2912*1224 పిక్సెల్స్) రెజుల్యూషన, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఎక్స్‌టర్నల్ స్క్రీన్: Xiaomi MIX Flip లో 4.01-ఇంచ్ ఓఎల్ఈడీ టీసీఎల్ సీ8+, 1392*1208 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, షావోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi MIX Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

కెమెరా: Xiaomi MIX Flip లో 50ఎంపి ఒమ్నివిజన్ 800 ఓఐఎస్ లెన్స్, 50ఎంపి ఒవి60ఏ4 టెలీఫోటో 2ఎక్స్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్816 కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Xiaomi MIX Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,780 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.