హైలైట్స్:
- లైట్ అనే కోడ్ నేమ్, 22041219l అనే కోడ్ నంబర్ ని కలిగిన రెడ్మీ 11 ప్రైమ్ 5జీ
- చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11ఈ ని పోలినట్లున్న రెడ్మీ 11 ప్రైమ్ 5జీ
- భారత్ లో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ధర రూ.12,000 గా ఉండే అవకాశం
షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ, త్వరలోనే భారత మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. నివేదికల ప్రకారం, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ భారత్ లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్మీ నోట్ 11ఈ 5జీ ఫోన్ కి ఇది రీబ్రాండెడ్ వర్షన్ అని అర్థమవుతోంది. కొన్ని వారాల క్రితం కొన్ని స్వల్ప మార్పులతో నోట్ 11ఈ 5జీ ఫోన్ పోకో ఎం4 5జీ గా భారత్ లో లాంచ్ అయ్యింది.
ఇలా రీబ్రాండ్ చేసి ఫోన్లను మార్కెట్ లోకి వదలడం షావోమీకి కొత్తేమీ కాదు. రీసెంట్ గా షావోమీ, రెడ్మీ నోట్ 11ఈ 5జీ ఫోన్ ని రెడ్మీ 10 5జీ పేనుతో ఇండోనేషియాలో లాంచ్ చేసింది. షావోమీయూఐ ప్రకారం, లైట్ అని కోడ్ నేమ్, 22041219l మోడల్ నంబర్ ని కలిగి ఉన్న రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
భారత్ లో Redmi 11 Prime 5G లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్
రెడ్మీ 11 ప్రైమ్ 5జీ త్వరలోనే భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, షావోమీ ఈ నెలలో ఫోన్ ని సైలెంట్ గా లాంచ్ చేసే అవకాశముంది. రెడ్మీ నోట్ 11ఈ 5జీ చైనా మోడల్ లాగే దీని స్పెసిఫికేషన్స్ ఉండనున్నాయి.
భారత వర్షన్ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్, వాటర్-డ్రాప్ నాచ్, ప్లాస్టిక్ ఫ్రేమ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉండనున్నాయి.
భారత్ లో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.12,000 గా ఉండే అవకాశముంది. రానున్న పండుగ సీజన్లో షావోమీ ఈ ఫోన్ ని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో షావోమీ ఓ ఈవెంట్ ను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షావోమీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రోటోటైప్ ని జనాల ముందుకు తీసుకువచ్చే అవకాశముంది. అలాగే ఇతర డివైజెస్ ను కూడా లాంచ్ చేయనుంది.