తొలి ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi

హైలైట్స్:

  • ఆగస్టులో తన తొలి ఎలక్ట్రిక్ కార్ ప్రోటోటైప్ ని రెడీ చేయనున్న షావోమీ ఆటో డివిజన్
  • 2024 నుంచి మొదలుకానున్న కారు ఉత్పత్తి
  • షావోమీ యొక్క యిజువాంగ్ ప్లాంట్ లో తయారు కానున్న కారు

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేయనున్నట్లు సమాచారం. 2024 నుంచి ఈ కారు ఉత్పత్తి మొదలు కానున్నట్లు సమాచారం. తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నదేంటంటే, షావోమీ రూపొందించిన తన తొలి ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్ జనాల ముందుకు రాబోతోంది. అటు తర్వాత కారును షావోమీ టెస్ట్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చైనీస్ దిగ్గజ స్మార్ట్ ఫోన్ మేకర్ యొక్క ఎలక్ట్రిక్ లక్ష్యాలు ఏమిటన్నది తెలుస్తోంది. ఈ రంగంలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు షావోమీ గతేడాది వెల్లడించింది.

Xiaomi Electric Car ధర

షావోమీ ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్ ను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ప్రోటోటైప్ ఆగస్టులో విడుదలయ్యే అవకాశముంది. షావోమీ ఫౌండర్, సీఈవో లీ జున్ తొలిసారిగా ఈ కారును జనాల ముందు ప్రజెంట్ చేయనున్నట్లు సమాచారం. సినా టెక్ నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టి, కారు లాంచ్ కి ముందు జున్ షావోమీ ఆటోమోటివ్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది.

షావోమీ నుంచి రాబోవు తొలి ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన వివరాలు ఎక్కువగా లీక్ కాలేదు. అందుకనే, మనకు ఎక్కువ విషయాలు తెలియలేదు. అయితే, హెచ్వీఎస్టీ ఆటోమొబైల్ డిజైన్ కు చెందిన మాజీ ఉద్యోగులను షావోమీ ఆటో డివిజన్ నియమించుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే షావోమీ ఎలక్ట్రిక్ కారు పై అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు కారుని చూస్తామా అని జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో, షావోమీ తన తొలి ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్ ను ఆగస్టులో రివీల్ చేయనుందని, ఆ తదుపరి, టెస్టింగ్ ఫేస్ ఉండనుందని సమాచారం. అయితే, 2024 లో కారు ఉత్పత్తి మొదలుకానుంది.

షావోమీ ఎలక్ట్రిక్ కారు ధర రూ.17.7 లక్షల వద్ద మొదలై రూ.35.4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Xiaomi మొదటి ఏడాది టార్గెట్ ఇదే

షావోమీ ఆటో డివిజన్ త్వరలోనే యిజువాంగ్ లో ఆర్ అండ్ డీ ఫెసిలిటీ మరియు ప్రొడక్షన్ యూనిట్ ను ఏర్పరచుకోనుంది. పూర్తి సామర్థ్యంతో పని చేస్తే, ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 3,00,000 యూనిట్లు ఉత్పత్తి చేయనుందని సమాచారం.

తొలి ఏడాది (2024) లో 1,50,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని షావోమీ భావిస్తోందట. ఒకరు కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్ళగలిగే విధంగా మొత్తంగా నాలుగు రకాల మోడళ్ళను లాంచ్ చేయాలని షావోమీ అనుకుంటున్నట్లు సమాచారం. కాంప్రెహెన్సివ్ ఏడీఏఎస్ ద్వారా లెవెల్ 2 ఆటోనామస్ డ్రైవింగ్ కు షావోమీ కార్లు సపోర్ట్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన షావోమీ, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Previous articleలీకైన Samsung Galaxy Z Flip 4 ధర
Next articleనేడు భారత్ లో మొదలైన Nothing Phone (1) ఓపెన్ సేల్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.