హైలైట్స్:
* శాంసంగ్ గెలాక్సీ ఎమ్13, గెలాక్సీ ఎమ్13 5జీ జులై 14 న లాంచ్ కానున్నాయి.
* అమెజాన్ ద్వారా ఈ ఫోన్లు అమ్ముడవ్వనున్నాయి.
* శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 మరియు గెలాక్సీ ఎమ్13 5జీ ఫోన్లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్, ట్రిపుల్ కెమెరాలతో వస్తున్నాయి.
Samsung Galaxy M13, Galaxy M13 5G ఫోన్లు భారత్ లో ఏ తేదీన లాంచ్ అవుతాయన్న విషయాన్ని సదరు కంపెనీ స్పష్టం చేసింది. జులై 14 న మధ్యాహ్నం 12 నుంచి భారత్ లో ఈ సరికొత్త గెలాక్సీ ఎమ్ సిరీస్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో ఈ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా తెలియవచ్చాయి. 6000ఎంఏహెచ్ బ్యాటరీ (4జీ వర్షన్), 5000ఎంఏహెచ్ బ్యాటరీ (5జీ వర్షన్), 12జిబి దాకా ర్యామ్ ఆప్షన్, అయితే ఇది వర్చువల్ ర్యామ్ అయ్యుండచ్చని తెలుస్తోంది. 4జీ వర్షన్ లో ఆటో డేటా స్విచింగ్ ఫీచర్ ఉండనుంది. దీంతో సిగ్నల్ లేనప్పుడు ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కి మారడం సులభమవుతుంది.
మే నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ వర్షన్ గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్13 4జీ స్పెసిఫికేషన్స్ కూడా మనకు తెలుసు. ఇక ఈలోపు ఎఫ్సీసీ లిస్టింగ్ ద్వారా 5జీ వర్షన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
శాంసంగ్ ఎమ్13, గెలాక్సీ ఎమ్13 5జీ ఇండియా లాంచ్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 మరియు గెలాక్సీ ఎమ్13 5జీ జులై 14 న భారత్ లో లాంచ్ అవుతున్నాయి. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ల యొక్క పూర్తి డిజైన్ బయటకు వచ్చింది. 4జీ వర్షన్ ని గమనిస్తే, మూడు వెనుక కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇక 5జీ మోడల్ కేవలం రెండు వెనుక కెమెరాలను మాత్రమే కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి. ముందు వైపున, రెండు మోడల్స్ లోనూ సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇక నాణ్యత ప్రమాణాలను చూస్తే, రెండు ఫోన్లు కూడా ప్లాస్టిక్ బాడీతో తయారైనట్లు తెలుస్తోంది.

శాంసంగ్ ఎమ్13 ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, స్లిమ్ బెజెల్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ ను వాడారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది. స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టిబి దాకా పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 స్కిన్ పై పని చేస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. అలాగే ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు 8ఎంపి కెమెరా ఉంది.
ఫోన్ భద్రతకై ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అలాగే 4G LTE, Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్ మరియు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి.
Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్స్
ఇక శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 5జీ లో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఇవ్వబడ్డాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 4.0 స్కిన్ పై పని చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 5జీ ఫోన్లో రెండు వెనక కెమెరాలుంటాయి. ఇందులో ఒకటి 50ఎంపి ప్రధాన కెమెరా. ఇకపోతే, ఈ ఫోన్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేశారు. అలాగే 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉంది.











