ఎండాకాలం వచ్చిందంటే వేడికి తాళలేక జనాలు ఏసీలను ఆశ్రయిస్తారు. అయితే ఏసీలను ఎంపిక చేసుకోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. గది సైజు, ఇంటి సభ్యుల సంఖ్య, బడ్జెట్ వంటి వాటి ఆధారంగా ఏసీ ని ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నా.. లేదా పెద్ద గది అయినా ఏసీ టన్నేజీ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి.
గది సైజు 120 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటే 1.5 టన్ ఏసీని ఎంపిక చేసుకోవాలి. అంతకన్నా తక్కువ ఉంటే 1 టన్ లేదా 0.8 టన్ కెపాసిటీ గల ఏసీని కొనుగోలు చేయాలి. గది వైశాల్యం తక్కువగా ఉండి జనాలు సంఖ్య ఎక్కువగా ఉంటే, అప్పుడు 1.5 టన్ ఏసీని తీసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడు ఏసీని కొనాలనుకున్నా మార్కెట్ లో ఉన్న బెటర్ ఆప్షన్స్ ఏంటి, వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఏంటి, ఫీచర్లు ఎలా ఉన్నాయి అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే మనం సరైన ఏసీని కొనే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా ఏసీని కొంటే గనుక ఇదివరకు కొన్న వినియోగదారుల రివ్యూలు ఎలా ఉన్నాయో చూడండి. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంటే అప్పుడు సదరు ప్రొడక్ట్ ని ఎంచుకోండి.
సరే, ఈ ఆర్టికల్ లో మీకోసం రూ.30,000 లోపు ధర కలిగిన ఏసీ ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చూడండి.
రూ.30 వేల లోపు ధరలో లభించే స్ప్లిట్ ఏసీలు
1. MarQ 0.7 Ton 3 Star Split Inverter AC
ఫ్లిప్ కార్ట్ బ్రాండ్ మార్క్యూ 0.7 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ధర రూ.25,499 గా ఉంది. ఈ ఏసీ 880 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ అంతకన్నా తక్కువ సైజు గల గదులకు ఈ ఏసీ బాగా సరిపోతుంది.
2. Carrier 0.8 Ton 3 Star Split Inverter AC
కరియర్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.27,999 గా ఉంది. ఈ ఏసీ 526.03 వాట్ల విద్యుత్ ని వాడుకుటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీ ప్రయోజనకరంగా ఉంటుంది.
3. Lloyd 0.8 Ton 3 Star Split Inverter AC
లాయిడ్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.26,999 గా ఉంది. ఈ ఏసీ ఏడాదికి 549.06 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంత కన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీని పెట్టుకోవచ్చు.
4. Onida 1 Ton 3 Star Split Inverter AC
ఒనిడా 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.28,999 గా ఉంది. ఈ ఏసీ ఏడాదికి 696.69 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీ ని బిగించుకోవచ్చు.
5. Godrej 5-in-1 Convertible Cooling 1 Ton 3 Star AC
గొద్రెజ్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.29,490 గా ఉంది. ఈ ఏసీ 694.03 కిలోవాట్ అవర్ విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదులకు ఈ ఏసీ సరిపోతుంది.
6. Lloyd 1 Ton 2 Star Split AC
లాయిడ్ 1 టన్ 2 స్టార్ స్ప్లిట్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.28,000 గా ఉంది. ఈ ఏసీ 744.69 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీని బిగించుకోవచ్చు.
7. Whirlpool Convertible 4-in-1 Cooling 0.8 Ton 3 Star AC
వర్ల్‌పూల్ కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ 0.8 టన్ 3 స్టార్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.28,499 గా ఉంది. ఈ ఏసీ 890 వాట్ విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీ ని వాడుకోవచ్చు.
8. Candy 1 Ton 4 Star Split Inverter AC
క్యాండీ 1 టన్ 4 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.28,990 గా ఉంది. ఈ ఏసీ 600.21 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీని బిగించుకోవచ్చు.
9. Thomson 1 Ton 2 Star Split AC
థాంమ్సన్ 1 టన్ 2 స్టార్ స్ప్లిట్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.27,999 గా ఉంది. ఈ ఏసీ 732.3 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల రూముల్లో ఈ ఏసీని బిగించుకోవచ్చు.
10. Voltas 0.75 Ton 3 Star Split AC
వొల్టాస్ 0.75 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.27,499 గా ఉంది. ఈ ఏసీ ఏడాదికి 940 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. 90 స్క్వేర్ ఫీట్ లేదా అంతకన్నా తక్కువ సైజు గల గదుల్లో ఈ ఏసీని వాడుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
