
కెమెరా ఫోన్లకు ఉన్న గిరాకీయే వేరు. అది ఏ రేంజ్ బడ్జెట్ అయినా సరే, ఆ ఫోన్ లో కెమెరా బాగుండాలంతే. యూజర్లు చక్కటి కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవాలని సదా కోరుకుంటుంటారు. మరి వారి ఆశలకు తగినట్లుగానే మొబైల్ ఫోన్ కంపెనీలు మంచి కెమెరాతో పాటు, సూపర్బ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి.
మెగాపిక్సెల్స్ ఎన్ని ఎక్కువుంటే అంత గొప్ప కెమెరా అని యూజర్లు భావిస్తుంటారు. అయితే సెన్సర్ క్వాలిటీ కూడా ముఖ్యమేననుకోండి. సరే, ఆ విషయం పక్కనబెడితే, మనకు బడ్జెట్ లో, చవకైన గుడ్ కెమెరా ఫోన్ కావాలి కదా. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే ఆ కిక్కే వేరు. మీకోసం ఈ ఆర్టికల్ లో 108ఎంపి కెమెరా గల రూ.15,000 లోపు ధరలో లభించే ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి లుక్ వేయండి మరి.
Realme C53
Realme C53 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరాను అందించారు. దీంతో పాటు 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6.74-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ612 చిప్ వాడారు. Realme C53 ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Infinix Note 30 5G
Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు. Infinix Note 30 5G డివైజ్ 4జిబి వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.14,999 గా ఉంది.
Redmi Note 11S
Redmi Note 11S స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇంాక ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6.43-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 11S డివైజ్ ఫ్లిప్ కార్ట్ లో రూ.13,838 కి అందుబాటులో ఉంది. ఇదే ఫోన్ అమెజాన్ లో రూ.12,999 కి అందుబాటులో ఉంది.
Infinix Zero 20
Infinix Zero 20 డివైజ్ లో 108ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ లో లభ్యమవుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.15,499 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ని అసలు ధర కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
Motorola G60
Motorola G60 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.14,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఉన్నాయి.