Home List రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు

రూ.20,000 లోపు ధరలో లభిస్తోన్న 108MP కెమెరా ఫోన్లు

ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనైనా ఫోన్లలోనే అయిపోతోంది. మరీ ముఖ్యంగా కెమెరా అవసరాలను స్మార్ట్ ఫోన్లు బాగా తీరుస్తున్నాయి. ప్రత్యేకంగా కెమెరా కొనాల్సిన అవసరం లేకుండా ఫోన్లలో ఉండే కెమెరాలు రకరకాల ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్నాయి. వైడ్ యాంగిల్, మ్యాక్రో, పొట్రెయిట్, డెప్త్, పెరిస్కోప్, టెలీఫోటో ఇలా అన్ని రకాల కెమెరా సెన్సర్స్ ఫోన్లలో అమరిపోతున్నాయి.

మంచి కెమెరా ఉన్న ఫోన్ చేతిలో ఉంటే అలా క్లిక్ అనిపిస్తూ ముందుకెళ్తారు యూజర్లు. కెమెరా నాణ్యమైన ఫోటోలను వీడియోలను తీయడం ఎంతో అవసరం. ఫోన్ కొనేటప్పుడు అందులో ఉన్న కెమెరా సామర్థ్యాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిది. సరే, ఈ ఆర్టికల్ లో మనం రూ.20,000 లోపు ధరలో లభించే 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ల జాబితాను చూద్దాం.

రూ.20,000 ధరలోపు అందుబాటులో ఉన్న 108ఎంపి కెమెరా ఫోన్లు

1. Redmi Note 11S

2. Infinix Note 12 Pro 5G

3. Realme 10 Pro 5G

4. Motorola G72

5. Infinix Zero 20

6. OnePlus Nord CE 3 Lite 5G

7. Realme 9 4G

Redmi Note 11S

Redmi Note 11S స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ఏఐ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 గా ఉంది.

Infinix Note 12 Pro 5G

Infinix Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999 కి లభిస్తోంది. ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 2టిబి వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి.

Realme 10 Pro 5G

Realme 10 Pro 5G డివైజ్ రూ.19,999 ధరకి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.

Motorola G72

Motorola G72 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.16,999 గా ఉంది.

Infinix Zero 20

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా, 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉన్నాయి.

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G లో 108ఎంపి + 2ఎంపి +2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ధర అమెజాన్ లో రూ.19,999 గా ఉంది.

Realme 9

Realme 9 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 680 చిప్, 6జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.4-ఇంచ్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది.