Home News 5G వేలం రెండో రోజు విశేషాలు: రూ.1.49 లక్షల కోట్లు దాటిన బిడ్డింగ్

5G వేలం రెండో రోజు విశేషాలు: రూ.1.49 లక్షల కోట్లు దాటిన బిడ్డింగ్

హైలైట్స్:

రెండో రోజున 5జీ నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వం ఇప్పటికే సముపార్జించిన రూ.1.45 లక్షల కోట్ల మొత్తానికి మరొక రూ.4 వేల కోట్లను ప్రోగు చేసింది. దీంతో బిడ్ మొత్తం విలువ రూ.1.49 లక్షల కోట్లకు చేరింది.

బుధవారం నాడు, మిడ్ బ్యాండ్ అయిన సీ-బ్యాండ్ (3.3 – 3.67 గిగాహెర్ట్జ్) మరియు హై బ్యాండ్ (26 గిగాహెర్ట్జ్) లకై టెలీకామ్ కంపెనీలు ఇంటెన్స్ గా బిడ్డింగ్ వేశాయి. మూడవ రోజైన గురువారం నాడు సేల్ ముగుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముందే అనుకున్నట్లుగా, దేశంలో 5జీ సేవలు అక్టోబర్ నుంచి మొదలు కానున్నాయి. ప్రభుత్వం డెడ్ లైన్ ఆగస్టు 14 లోపు స్పెక్ట్రమ్ ను కేటాయించనుంది.

రెండో రోజు జరిగిన 5జీ వేలం గురించి కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్వనీ వైష్ణవ్ రిపోర్టర్స్ తో మాట్లాడారు. “ఇప్పటి వరకు, 9వ రౌండ్ ముగిసే సరికి, రూ.1,49,454 కోట్లను ఆర్జించామని” మంత్రి చెప్పారు. ఇండస్ట్రీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలో విజయం సాధించామని ఆయన అన్నారు.

భారత్ లో 5G వేలం

బుధవారం బిడ్డింగ్ ముగిసే నాటికి, జియో రూ.82,500 కోట్లను వెచ్చించింది. రూ.46,000 కోట్లతో ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఉంది. ఇక వొడాఫోన్ ఐడియా (వీఐ) రూ.19,000 కోట్లు వెచ్చించి మూడవ స్థానంలో నిలిచింది. మరోవైపు, కొత్తగా ప్రవేశించిన అదాని డేటా వర్క్స్ రూ.900 నుంచి రూ.1000 కోట్ల మధ్య హై-బ్యాండ్ కొరకు బిడ్ వేశారు. విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం, 700 గిగాహెర్ట్జ్ బ్యాండ్ దక్కించుకున్న ఒకే ఒక్క టెలీకామ్ కంపెనీ జియో అని తెలుస్తోంది. మిగతా 5జీ సర్వీసెస్ కి ఈ పరిణామం పోటీని కలిగించే అవకాశముంది.

తూర్పు-ఉత్తరప్రదేశ్, ఒడిశా సర్కిల్స్ లో 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ విషయమై, జియో మరియు ఎయిర్టెల్ మధ్య బిడ్డింగ్ సరళిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని ఒక ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. “ప్రత్యేకించి యూపీ-ఈస్ట్ లో చాలా డిమాండ్ ఉంది, దీంతో బిడ్డింగ్ లో అలజడి రేగింది,” అని సదరు ఎగ్జిక్యూటివ్ (via) చెప్పారు. యూపీ ఈస్ట్ లో లక్నో, ప్రయాగ్ రాజ్, వారణాసి, గోరఖ్ పూర్ వంటి నగరాలు ఉన్నాయి.

అలాగే మేజర్ టెలీకామ్ ఆపరేటర్స్ అయిన ఎయిర్టెల్, జియో.. జమ్ము మరియు కశ్మీర్, నార్త్ ఈస్ట్, కర్ణాటక, కేరళ, యూపీ-వెస్ట్, రాజస్తాన్, ఎంపీ, హిమాచల్ ప్రదేశ్ లతో కలుపుకుని మొత్తం ఎనిమిది సర్కిల్స్ కు సంబంధించిన మిడ్-బ్యాండ్ తరంగాల కోసం బిడ్డింగ్ లో పోటీపడ్డారు. కేరళ లో 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం మరోమారు ఇరు టెలీకామ్ ఆపరేటర్ల నడుమ ఇంటెన్స్ బిడ్డింగ్ జరిగింది.

“ఏ ప్రాంతమైనా సరే, కవరేజీ ఎంటో ముఖ్యం. మంచి కవరేజీ కొరకు మీకు లో-బ్యాండ్ కీలకం. సుదూర ప్రాంతాలకు ఈ బ్యాండ్ హై క్వాలిటీ సర్వీస్ ను అందించగలదు,” అని మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. ఇక 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ యొక్క ధరను 40 శాతం మేర తగ్గించడం జరిగింది. అయితే, ఈ బ్యాండ్ ఖరీదు చాలా ఎక్కువగా ఉందని, అందుచేత, గత రెండు ఆక్షన్స్ లో కూడా వాటిని పెద్దగా కొనలేదని, టెలీకమ్ టైకూన్స్ తెలిపారు.

5G Gear భాగస్వాములను ఎంచుకున్న టెలీకామ్ కంపెనీలు

జియో మరియు ఎయిర్టెల్ తమ 5జీ భాగస్వాములను ఎంపిక చేసుకున్నాయి. వీటిలో ఫిన్ లాండ్ కు చెందిన నోకియా, స్వీడెన్ కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్ ఉన్నాయి. భారత్ లో 5జీ రోలౌట్స్ కొరకు హువావే మరియు జెడ్టీఈ లకు ఎంట్రీ (via) రద్దైనది.