హైలైట్స్
- భారత్ లో కొనసాగుతోన్న 5జీ ఫోన్ల హవా, వరుసగా లాంచ్ అవుతోన్న 5జీ డివైజెస్
- తక్కువ బడ్జెట్ లో ఫోన్లను లాంచ్ చేస్తున్న మొబైల్ ఫోన్ మానుఫాక్చరింగ్ కంపెనీలు
- రూ.11,499 ధరతో చౌకైన 5జీ ఫోన్ గా నిలిచిన Redmi Note 10T 5G
చాలా రోజుల క్రితమే భారతదేశంలో 5జీ మొబైల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అప్పుడు 5జీ నెట్వర్క్స్ కూడా భారత్ లో అందుబాటులో లేవు. అప్పుడు 5జీ ప్రాముఖ్యత కొందరికే అర్థమైంది. కానీ 5జీ ఫోన్ల అవసరం ఏపాటిదో ఇప్పుడు జనాలకు అర్థమవుతోంది. ఫాస్ట్ గా ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేయాలనుకునే వారందరూ 5జీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్, జియో వంటి టెలీకామ్ కంపెనీలు తమ 5జీ సేవలను ప్రారంభించాయి. దేశంలో ప్రతి ఒక్కరికీ 5జీ సేవలు అందించేందుకు ఎయిర్టెల్, జియో, వీఐ, బీఎస్ఎన్ఎల్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాయి.
ఇప్పుడు 5జీ ఫోన్ల గురించి మాట్లాడుకుందాం. మీరు గనుక నెక్ట్స్ ఒక 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అది కూడా తక్కువ ధర కలిగిన 5జీ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఇక్కడ మేం రూ.15,000 లోపు లభిస్తున్న 5జీ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివేయండి.
Redmi Note 10T 5G
Redmi Note 10T 5G భారతీయ మార్కెట్ లో తక్కువ ధర కలిగిన 5జీ స్మార్ట్ ఫోన్. దీని ధర రూ.11,999 గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 48ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
POCO M4 5G
POCO M4 5G స్మార్ట్ ఫోన్ రూ.12,999 ధరలో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
iQOO Z6 5G
iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ని కలిగి ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. ఇతర ఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ లో 6.58-ఇంచ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
Vivo T1 5G
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. ఈ ఫోన్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుండటం విశేషం. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. Vivo T1 5G లో 6.58-ఇంచ్ డిస్ప్లే, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
Realme 9 5G
Realme 9 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయ్యింది. అమెజాన్ లో ఈ ఫోన్ రూ.14,990 ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 5జిబి వర్చువల్ ర్యామ్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ డిస్ప్లే, 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది.
OPPO A74 5G
OPPO A74 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080×2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 5జీ ఆక్టా కోర్ ప్రాసెసర్ ని వాడారు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో ఇంట్రడ్యూస్ అయ్యింది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్. ఈ ఫోన్ లో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.


















