హైలైట్స్
- దీపావళి సందర్భంగా రూ.439 రీచార్జ్ ప్లాన్ ని విడుదల చేసిన BSNL
- 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన రూ.439 రీచార్జ్ ప్లాన్
- అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్, 90 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్ ప్రయోజనాలు
మంచి నెట్వర్క్, ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలని తమ టెలీకామ్ ఆపరేటర్ నుంచి మొబైల్ యూజర్లు కోరుకుంటారు. వీటితో పాటు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే రీచార్జ్ ప్లాన్స్ కి కూడా బాగా డిమాండ్ ఉంటుంది. పలువురు యూజర్లు నెలవారీ రీచార్జ్ ప్లాన్స్ కాకుండా సుదీర్ఘమైన వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ ని కోరుకుంటారు. సరిగ్గా అటువంటి ప్లాన్ నే తాజాగా BSNL సంస్థ తీసుకొచ్చింది. అదే రూ.439 రీచార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.
90 రోజుల వ్యాలిడిటీ
BSNL కంపెనీ కొత్త రీచార్జ్ ప్లాన్ రూ.439 తో యూజర్ల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్యాక్ యొక్క ప్రధాన అప్ సెల్లింగ్ పాయింట్ 90 రోజుల వ్యాలిడిటీ. రూ.439 రీచార్జ్ ప్లాన్ చేసిన వారికి 3 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లతో పోల్చితే BSNL అత్యంత చౌకైన 90 రోజుల ప్లాన్ ని యూజర్లకు అందిస్తోంది.
BSNL రూ.439 రీచార్జ్ ప్లాన్
BSNL రూ.439 రీచార్జ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడితే, ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్, 90 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ 300 ఎస్ఎంఎస్ లకు రోజువారీ లిమిట్ ఏమీ లేదు. ఈ సందేశాలను మీరు ఎప్పుడైనా ఎలాగైనా వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ మరియు ఎస్ఎంఎస్ లు కావాలనుకునే వారికి BSNL తీసుకొచ్చిన రూ.439 ప్లాన్ సూట్ అవుతుంది.
డేటా వివరాలేంటని మీరు ఆలోచిస్తున్నారు కదా? అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ రూ.439 రీచార్జ్ ప్లాన్ తో BSNL ఎటువంటి ఇంటర్నెట్ డేటాను అందించడం లేదు. డేటా కోసం వేరుగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత చక్కటి ప్లాన్ కి డేటా లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. డేటా ఇవ్వకపోవడం వల్లన ఈ ప్లాన్ పట్ల యూజర్లు మొగ్గు చూపకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ యుగంలో ఎంతటి గొప్ప ప్లాన్ అయినా అందులో డేటాని కలిపి ఇవ్వకపోతే కష్టమే. మరి BSNL యొక్క రూ.439 ప్లాన్ ని యూజర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కాకపోతే వ్యాలిడిటీ + ఎస్ఎంఎస్ లు కావాలనుకునే వారికి ఈ ఆఫర్ ఉత్తమ ఎంపిక. అలాగే BSNL లో తక్కువ ధరలో డేటా ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో కలుపుకుని రూ.439 రీచార్జ్ ప్లాన్ ని ఎంచుకుంటే అప్పుడు డేటా + వ్యాలిడిటీ ప్రయోజనాలను యూజర్లు పొందుతారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












