Home List రూ.15,000 లోపు ధరలో లభించే 8GB ర్యామ్ ఫోన్లు

రూ.15,000 లోపు ధరలో లభించే 8GB ర్యామ్ ఫోన్లు

Highlights
  • అధిక ర్యామ్ గల ఫోన్లకు జనాల్లో మంచి డిమాండ్
  • వివిధ ధరల శ్రేణుల్లో లభిస్తోన్న 8జిబి ర్యామ్ ఫోన్లు
  • రూ.15,000 లోపు ధరలో లభించే 8జిబి ర్యామ్ ఫోన్ల జాబితా మీకోసం

స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు యూజర్లు చూసే ప్రధాన స్పెసిఫికేషన్స్ లో ర్యామ్ ఒకటి. ఎక్కువ ర్యామ్ ఉంటే సమాచారాన్ని వేగంగా యాక్సెస్ చేయవచ్చు. అయితే అధిక ర్యామ్ ఫోన్ కావాలంటే, అందుకు ఎక్కువ మొత్తం డబ్బులు వెచ్చించాల్సిందే. కానీ, కొన్ని ఫోన్లు అందుబాటు ధరలోనే 8జిబి ర్యామ్ తో లభిస్తున్నాయి. 8జిబి ర్యామ్ అంటే సాధారణ స్మార్ట్ ఫోన్ వినియోగదారునుకి ఎంతో ఎక్కువేనని చెప్పాలి. వివిధ ధరల శ్రేణుల్లో 8జిబి ర్యామ్ ఫోన్లు మార్కెట్ లో లభిస్తున్నాయి.

మనం ఈ ఆర్టికల్ లో రూ.15,000 లోపు ధరలో లభించే 8జిబి ర్యామ్ స్మార్ట్ ఫోన్ల జాబితాను, చూద్దాం. అందుబాటు ధరలో దొరుకుతోన్న ఈ 8జిబి ర్యామ్ ఫోన్లేంటో తెలుసుకోండి.

రూ.15 వేల లోపు ధరలో లభించే 8జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లు

Infinix HOT 30i

ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ వేరియంట్ లో లభిస్తోంది. ఈ డివైజ్ లో 128జిబి స్టోరేజీ, మీడియాటెక్ జీ37 చిప్సెట్, 50ఎంపి కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,499 గా ఉంది.

Motorola G32

ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ సపోర్ట్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.12,099 గా ఉంది.

Realme C55

రియల్మీ సీ55 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ వాడారు. 64ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉంది. 8జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.13,999 గా ఉంది.

Redmi 10 Power

ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.11,585 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. 50ఎంపి మెయిన్ కెమెరా, రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Infinix HOT 12 Pro

ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.12,999 గా ఉంది. ఈ డివైజ్ లో యూనిసాక్ టీ616 చిప్సెట్ వాడారు. 50ఎంపి + డెప్త్ లెన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Infinix Note 11s Free Fire

ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వేరియంట్ డీల్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది. ఈ ధర డీల్ సమయం ముగిసాక మళ్ళీ పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది.

Infinix Note 12 Turbo

ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో 8జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.14,499 గా ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ96 చిప్సెట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Tecno POVA 4

ఈ డివైజ్ 8జిబి ర్యామ్ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.11,999 గా ఉంది. ఈ డివైజ్ లో 128జిబి స్టోరేజీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.