LAVA: రూ.6,799 ధరతో భారత్‌లో లాంచైన LAVA Yuva 3

Highlights

  • నేడు భారత్ లో లాంచైన LAVA Yuva 3
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • LAVA Yuva 3 ధర రూ.6,799 మాత్రమే

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ LAVA నేడు భారతీయ మార్కెట్ లో LAVA Yuva 3 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇటీవలె LAVA Yuva 3 ఫోన్ లాంచ్ గురించి లావా సంస్థ టీజ్ చేసింది. షాపింగ్ సైట్ అమెజాన్ ఇండియా లో ఈ ఫోన్ నిన్ననే లిస్ట్ అయ్యింది. నేడు అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. సరే, LAVA Yuva 3 స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేసే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

LAVA Yuva 3 ధర

  • LAVA Yuva 3 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • LAVA Yuva 3 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ,6,799 గా ఉంది.
  • LAVA Yuva 3 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది.
  • LAVA Yuva 3 సేల్ ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ద్వారా మొదలవుతుంది.
  • LAVA Yuva 3 స్మార్ట్‌ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్, కాస్మిక్ లావెండర్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

LAVA Yuva 3 డిజైన్

  • LAVA Yuva 3 స్మార్ట్‌ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
  • కెమెరా సెటప్ ని రూపొందించిన విధానం iPhone 15 Pro Max ని గుర్తు చేస్తుంది.
  • రియర్ ప్యానెల్ పూర్తిగా ఫ్లాట్ గా ఉంది. బాటమ్ లో లావా బ్రాండింగ్ ఉంది.
  • LAVA Yuva 3 లో కుడివైపు ఫ్రేమ్ పై వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ చేయబడి ఉంది.
  • LAVA Yuva 3 బాటమ్ ఫ్రేమ్ పై యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ ఉన్నాయి.

LAVA Yuva 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: LAVA Yuva 3 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: LAVA Yuva 3 డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ని కలిగి ఉంది.
  • ప్రాసెసర్: LAVA Yuva 3 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: LAVA Yuva 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
  • బ్యాటరీ: LAVA Yuva 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: LAVA Yuva 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, రెండు ఇతర సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: LAVA Yuva 3 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleBluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G
Next articleInfinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Infinix Hot 40i
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.