Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G

Highlights

  • త్వరలో రానున్న Vivo T3 5G, iQOO Z9 5G
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • Z8 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z9 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతోంది, ఈ ఫోన్ Vivo T3 5G అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. అలాగే వివో సబ్-బ్రాండ్ ఐకూ కూడా iQOO Z9 5G అనే డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ రెండు ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G, Vivo T3 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

  • iQOO Z9 5G డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై i2302 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ లో iQOO Z9 5G పేను కూడా పేర్కొనబడి ఉంది.
  • లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.
  • Vivo T3 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లిస్ట్ అవ్వడం ఇదే తొలిసారి. తర్వాత ఇతర సర్టిఫికేషన్స్ సైట్స్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ V2334 అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • వెబ్‌సైట్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.

iQOO Z8 స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: iQOO Z8 లో 6.64-ఇంచ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: iQOO Z8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: iQOO Z8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Z8 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleVivo Y27, Vivo T2 5G ఫోన్ల ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!
Next articleLAVA: రూ.6,799 ధరతో భారత్‌లో లాంచైన LAVA Yuva 3
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.