OnePlus: లీకైన కొత్త వన్‌ప్లస్ ఫోన్ రెండర్స్, నార్డ్ సిరీస్ లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • లీకైన OnePlus కొత్త ఫోన్ రెండర్స్
  • CPH2613 మోడల్ నంబర్ కల్గిన ఫోన్
  • 50ఎంపి కెమెరాతో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక చవకైన ఫోన్‌ని లాంచ్ చేయనుంది. అయితే ఇంకా వన్‌ప్లస్ నుంచి అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ ఈ ఫోన్ మోడల్ నంబర్ CPH2163 మరియు రెండర్స్ ని 91mobiles షేర్ చేసింది. ఫోన్ యొక్క అసలైన పేరు ఇంకా తెలియదు. సరే, ఓసారి డిజైన్ మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం పదండి.

కొత్త OnePlus ఫోన్ రెండర్స్ (లీక్)

  • 91mobiles కి ఎక్స్‌క్లూజివ్ సోర్సెస్ నుంచి అందిన సమాచారం ప్రకారం, కొత్త వన్‌ప్లస్ డివైజ్ CPH2613 మోడల్ నంబర్ కలిగి ఉంది.
  • డివైజ్ యొక్క రియర్ ప్యానెల్ గ్లాసీ ఫినిష్ తో ఉంది. డిస్ప్లే ఫ్లాట్ గా ఉంది. సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ అని తెలుస్తోంది.
  • స్క్రీన్ పై ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ని బట్టి, ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అమోలెడ్ ప్యానెల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

  • OnePlus కొత్త ఫోన్ లో సిమ్ ట్రే సెక్షన్, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో కనిపిస్తున్నాయి.
  • వన్‌ప్లస్ కొత్త ఫోన్ లో సెకండరీ మైక్రోఫోన్ టాప్ లో ఉంది. ఐఆర్ బ్లాస్టర్ లేదా 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

OnePlus CPH2163 కెమెరా లిస్టింగ్

 

  • OnePlus CPH2613 ఫోన్ ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4096*3072 పిక్చర్ రెజుల్యూషన్, 5.6ఎంఎం ఫోకల్ లెంగ్త్ మరియు ఓఐఎస్+ఈఐఎస్ ఉన్నాయి.
  • ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఈఐఎస్ మరియు 2304*1728 పిక్చర్ రెజుల్యూషన్ ఉన్నాయి.
Previous articleOPPO: గీక్‌బెంచ్‌పై లిస్టైన Reno 11F 5G
Next articleTECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.