హైలైట్స్:
- భారత్ లో నిలిచిపోనున్న షావోమీ 11 లైట్
- దాని స్థానాన్ని ఆక్రమించనున్న షావోమీ 12 లైట్
- స్నాప్ డ్రాగన్ 778జి, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
షావోమీ 11 లైట్ కి సక్సెస్సర్ గా వచ్చిన షావోమీ 12 లైట్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్ అయిన షావోమీ 12 లైట్ 778జి చిప్సెట్ తో వస్తోంది. టిప్ స్టర్ పారస్ గుగ్లాని చెబుతున్న దాన్ని బట్టి, షావోమీ ఎంఐ 11 లైట్ డిస్ కంటిన్యూ అవ్వడమో లేదా స్టోర్స్ నుంచి తీసివేయడమో జరుగుతుందని సమాచారం. షావోమీ 12 లైట్ లాంచ్ అవ్వనున్న సందర్భంలో, పాతదైన ఎంఐ 11 లైట్ 4జి మోడల్ ను కొనసాగించడం వల్లన పెద్దగా ఒనగూరేదేమీ లేదు. అందుకే ఆ మోడల్ ని నిలిపివేయాలని షావోమీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లైట్ వెయిట్ ఫోన్ గా ఎంఐ 11 లైట్ మంచి ఆదరణ పొందింది.
అయితే షావోమీ 12 లైట్ ఎప్పుడు లాంచ్ అవుతుందోనన్న విషయాన్ని సదరు కంపెనీ వెల్లడించలేదు. అయితే రానున్న కొన్ని వారాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశముందని సమాచారం. 12 లైట్ ఫోన్ వచ్చాక కూడా షావోమీ ఎంఐ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్ కొనసాగనున్నట్లు టిప్ స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు.
According to my sources, soon Mi 11 Lite will be removed/discontinued from the platforms as successor xiaomi 12 lite might enter the India in upcoming months …NE edition remains available
— Paras Guglani (@passionategeekz) July 14, 2022
Xiaomi 12 Lite 5G స్పెసిఫికేషన్స్
6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, హెచ్డీఆర్10+, స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, 6జిబి/8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు షావోమీ 12 లైట్ 5జీ ఫోన్లో ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే, షావోమీ 12 లైట్ 5జీ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎం2 సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
షావోమీ 12 లైట్ ఫోన్లో ఐపీ53 రేటింగ్ ఉంది. ఇది ఫోన్ కి దుమ్ము మరియు నీటి జల్లుల నుంచి రక్షణ కల్పించనుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క బ్యాటరీ విభాగం ఎలా ఉందో చూద్దాం. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని 12 లైట్ ఫోన్ కలిగి ఉంది. షావోమీ 12 లైట్ లో డ్యూయల్ 4జి వోల్టీ, 5జీ స్టాండ్ బై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లున్నాయి. కాగా, ఈ ఫోన్ బరువు 173 గ్రాములు.












