
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో POVA 6 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో TECNO POVA 6 Pro 5G లాంచ్ కానుందని టెక్నో సంస్థ వెల్లడించింది. ఈలోపు TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్
- TECNO POVA 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. TECNO-L19 అనే మోడల్ నంబర్ తో డివైజ్ లిస్ట్ అయ్యింది.
- TECNO POVA 6 Pro 5G లో బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఎఫ్‌సీసీ)
- ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై TECNO POVA 6 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో కనిపించింది.
- TECNO POVA 6 Pro 5G డివైజ్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.
TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: TECNO POVA 6 Pro 5G లో 2436*1080 మరియు 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: TECNO POVA 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
- కెమెరా: TECNO POVA 6 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు మరొక సెన్సర్ ఉంటుంది.
Tecno Pova 5 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Pova 5 లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Pova 5 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ ఫోన్ లో జీ యాక్సెస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్ ఉంది.
- స్టోరేజీ, ర్యామ్: Tecno Pova 5 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- బ్యాటరీ: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 21 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 10 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
- కెమెరా: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- సౌండ్: Tecno Pova 5 డివైజ్ లో డ్యూయల్ స్పీకర్స్ , డీటీఎస్ సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: Tecno Pova 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.











