
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme భారత్ లో Realme 12 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు సేల్ కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రియల్మీ Realme 12+ 5G అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ డివైజ్ గీక్బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme 12+ 5G గీక్బెంచ్ లిస్టింగ్

- Realme యొక్క కొత్త డివైజ్ గీక్బెంచ్ పై RMX3867 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 958 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 2346 పాయింట్లు స్కోర్ చేసింది.
- Realme కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
- గీక్బెంచ్ పై ఈ కొత్త ఫోన్ 11.28జిబి ర్యామ్ తో ఉంది. అంటే దీన్ని 12జిబి ర్యామ్ అని అనుకోవచ్చు.
- ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గీక్బెంచ్ ద్వారా తెలుస్తోంది.
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని గీక్బెంచ్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చే అవకాశం ఉంది.
- కెమెరా (గ్లోబల్ మోడల్): Realme 12+ 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
- కెమెరా (చైనా మోడల్): Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
- బ్యాటరీ: Realme 12+ 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
- ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తుందని సమాచారం.











